షర్మిల కాబోయే కోడలు చంద్రబాబు బంధువేనా..?
వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డికి పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్లూరి ప్రియ అనే అమ్మాయిని మరికొద్ది రోజుల్లో షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇంటి కోడలు కావడంతో నెటిజన్లు రాజారెడ్డికి కాబోయే భార్య అట్లూరి ప్రియ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
Recommended Video

వైఎస్ షర్మిల కాబోయే కోడలు ప్రియ బ్యాక్ గ్రౌండ్ గురించి రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. మొదట అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు అని ప్రచారం జరిగింది. అయితే ఆమె అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని తెలిసింది. తాజాగా అట్లూరి ప్రియకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె బ్రదర్ అనిల్ స్నేహితుడైన అట్లూరి శ్రీనివాస్ - మాధవి దంపతుల కుమార్తె అని తేలింది. అమెరికాలో సెటిల్ అయిన అట్లూరి శ్రీనివాస్.. అక్కడ బ్రదర్ అనిల్‌కు సంబంధించిన కార్యక్రమాలను కూడా ఆయనే పర్యవేక్షిస్తారని తెలుస్తుంది. ఈక్రమంలోనే ఇరు కుటుంబల మధ్య రాకపోకలు ఉండటంతో.. రాజారెడ్డి - ప్రియ మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది.
ఇదిలా ఉంటే అట్లూరి ప్రియ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. జగన్‌ను శత్రువుగా భావించే సామాజికవర్గం నుంచి షర్మిల కొడలును తెచ్చుకోవడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అట్లూరి ప్రియ చంద్రబాబు బంధువు అవుతారని అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు షర్మిల జగన్‌ను కాదని బయటకు వెళ్లినప్పుడే ఆమెతో మన బంధం తెగిపోయిందని.. ఆమె గురించి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అట్లూరి ప్రియకు చంద్రబాబుకు మధ్య ఎటువంటి బంధుత్వం లేదని తెలుస్తుంది. సోషల్ మీడియాలో కావాలనే ఈరకమైన ప్రచారం జరుగుతుందని సమాచారం.












Click it and Unblock the Notifications