షర్మిల కుమారుడు వివాహ ముహూర్తం, వేదిక ఖరారు - ఆహ్వానాలు..!!

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయిపేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రియా పేరున్న కుటుంబానికి చెందినది. ఇప్పుడు, వివాహ ముహూర్తంతో పాటుగా వేదికను కుటుంబ సభ్యులు ఖరారు చేసారు.

వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలె్‌సలో కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయమ్మ, షర్మిల అమెరికాలోనే ఉన్నారు. జనవరి రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్‌లో నిశ్చితార్థం ఉంటుందని తెలిసింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ప్రియతో రాజారెడ్డి వివాహం ఖరారైన సంగతి తెలిసిందే. ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్‌ అమెరికాలో స్థిరపడ్డారు.

Ys Sharmila Son Raja Reddy Getting Married With Priya Atluri on February 17th

అయితే, ఆయన ప్రియా చట్నీస్‌ సంస్థల అధినేత ప్రసాద్‌ తనయుడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఆయనకు తమ అధినేత, చట్నీస్‌ సంస్థలతో ఏ సంబంధం లేదని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజాగా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయిపేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రియా పేరున్న కుటుంబానికి చెందినది. దగ్గరి బంధువులను నిశ్చితార్దానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+