9 రోజుల్లో ఏపీని చుట్టేయబోతున్న వైఎస్ షర్మిల-తాజా షెడ్యూల్ ఇదే..!
ఏపీసీసీ ఛీఫ్ తాజాగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్దమవుతున్నారు. అయితే జనంలోకి వెళ్లే ముందు పార్టీ నేతలతో జిల్లాల్లో సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు.
దీని ప్రకారం రేపు శ్రీకాకుళంలో మొదలయ్యే ఈ పర్యటన ఏకధాటిగా 9 రోజుల పాటు సాగి జనవరి 31న వైఎస్సార్ కడప జిల్లాల్లో ముగియనుంది. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితిని షర్మిల అంచనా వేసుకోనున్నట్లు తెలుస్తోంది.

వైఎస్ షర్మిల తన రాష్ట్రవ్యాప్త పర్యటనను రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ప్రారంభించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా సమీక్ష ముగిశాక పార్వతీపురం మన్యం జిల్లా సమీక్షను పార్వతీపురంలోనూ, విజయనగరం సమీక్షను జిల్లా కేంద్రంలోనూ నిర్వహిస్తారు. ఎల్లుండి జనవరి 24న విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమీక్షల్ని షర్మిల ఆయా జిల్లా కేంద్రాల్లో చేపడతారు. జనవరి 25న కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల సమీక్షలు ఉంటాయి.
జనవరి 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల సమీక్షల్ని ఆయా జిల్లా కేంద్రాల్లోనే షర్మిల నిర్వహిస్తారు. జనవరి 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల సమీక్షలు ఉంటాయి. జనవరి 28న బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమీక్షలు నిర్వహిస్తారు. జనవరి 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల సమీక్షలు ఉంటాయి. జనవరి 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల సమీక్షల్ని షర్మిల చేపడతారు. చివరిగా జనవరి 31న నంద్యాల, వైఎస్సార్ జిల్లా సమీక్షలతో షర్మిల పర్యటన ముగియనుంది.












Click it and Unblock the Notifications