ఎన్నికల్లో పోటీ పైన వైఎస్ షర్మిల కీలక నిర్ణయం - హోరా హోరీ..!!
ఏపీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల్లో పోటీ పైన కీలక ప్రకటనకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా పైన కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాక్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా షర్మిల ఎన్నికల బరిలో నిలవటంతో హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
వైఎస్ షర్మిల పోటీ పైన ఉత్కంఠకు తెర పడనుంది. షరమిల కడప జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో తన పోటీపై క్లారిటీ ఇవ్వడంతో పాటు.. జిల్లాలోని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైనా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన పార్లమెంట్ పరిధిలో బలమైన వ్యక్తులనే ఎమ్మె్ల్యే అభ్యర్థులుగా బరిలోకి దించాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సమావేశంలో అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని, మరో రెండు, మూడు రోజుల్లో తొలి జాబితా విడుదల కానుంది.

జగన్ పార్టీ ఏర్పాటు తో ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ పార్టీకి బదిలీ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసినప్పటికి ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. దీంతో ఏపీలో కాంగ్రెస్‌ను మళ్లీ బతికించాలనే లక్ష్యంతో అడుగులు వేసిన ఆ పార్టీ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో తమ పార్టీ నుంచి వైసీపీకి మళ్లిన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు షర్మిల వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే కడప ఎంపీ అభ్యర్దిగా వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి పేరు ప్రకటించారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మను నిలబెట్టేలా చర్చలు జరిగాయి. కానీ, కాంగ్రెస్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి వస్తుండటంతో...ఎంపీగా పోటీ పైన షర్మిల ఈ రోజు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications