Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షర్మిల ఆపరేషన్ షురూ -కాంగ్రెస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు, లిస్టులో..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరికలే లక్ష్యంగా తొలి అడుగులు వేస్తున్నారు.

షర్మిల బాధ్యతలు: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల ఆదివారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నాలుగు గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.

YS Sharmila will take charge as APCC president on 21st January, key leaders to join in the party

Recommended Video

    APCC గా Ys Sharmila బాధ్యతలు.. వెంటనే Congress లోకి ఇద్దరు MLA లు | Telugu Oneindia

    ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సహా కాంగ్రెస్ నేతలు ఇడుపులపాయ వెళతారు. ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం విజయవాడలో ఒక ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

    కాంగ్రెస్ లో చేరికలు: షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీలో చేరికల ద్వారా ఎంట్రీతోనే ప్రభావం చూపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన షర్మిల పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టుగా పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు.

    మంగళగిరి ఎమ్మెల్యే బాటలోనే.. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా.. రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరతారని చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా సీటు దక్కని మరో ఎమ్మెల్యేతోనూ కాంగ్రెస్ సీనియర్ నేత టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీతో పాటుగా టీడీపీ నేతలు కొందరితో కాంగ్రెస్ ముఖ్యులు మంతనాలు చేస్తున్నారని సమాచారం.

    YS Sharmila will take charge as APCC president on 21st January, key leaders to join in the party

    జిల్లాల పర్యటనలు: ఈ నెల 23న ఏపీసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ విజయవాడ వస్తున్నారు. ఆ రోజు ఆయన పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. పీసీసీ చీఫ్ షర్మిలకు ఎన్నికల రోడ్ మ్యాప్ పైన దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక జిల్లాల పర్యటనకు షర్మిల సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ముందుగా పార్టీలో చేరికలు, బలోపేతం పైన కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

    ప్రత్యేక హోదా, విభజన హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ని రాజకీయంగా టార్గెట్ చేస్తారని చెబుతున్నారు. అయితే, షర్మిల ప్రసంగాలు ఎలా ఉంటాయి.. స్పందన ఎలా ఉంటుంది.. ఏ మేర ఓట్లను సాధిస్తారు..ఎవరికి నష్టం చేస్తారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+