అవినాశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ - కండీషన్స్ అప్లై..!!

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాదాపు నెల రోజులుగా వివేకా హత్య కేసులో సీబీఐ నమోదు చేసిన అభియోగాల పైన విచారణ జరుగుతోంది. సీబీఐ అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ అవినాశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సమయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టేయాలని సీబీఐ..సునీత తరపు న్యాయవాదులు కోరారు. అవినాశ్ మాత్రం సీబీఐ విచారణ తీరును తప్పు బట్టారు. వాదనలు పూర్తిగా రికార్డు చేసిన హైకోర్టు ఈ రోజు కండీషన్లతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

hc grants to avinash reddy

ఎట్టకేలకు బెయిల్ మంజూరు:వైఎస్ వివేకా కేసులో కొంత కాలంగా భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ అనేక అభియోగాలు నమోదు చేసింది. వివేకా కేసులో ఎంపీ అవినాశ్ ను సీబీఐ ఏడు సార్లు విచారణ చేసింది. వివేకా కేసులో అవినాశ్ ను సీబీఐ సహ నిందితుడుగా పేర్కొంది. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు టాంపర్ చేసినట్లుగా ఆరోపించింది.

వివేకా తో రాజకీయ విభేదాలతోనే అవినాశ్ అంతం చేయాలని భావించారని సీబీఐ కోర్టు ముందు ఆరోపించింది. రహస్య సాక్షి ద్వారా తాము రాజకీయ హత్యగా నిర్దారణకు వచ్చామని చెప్పుకొచ్చింది. ఎన్నికల వేళ ముందుగానే అవినాశ్ అభ్యర్ధిత్వం ఖరారైన అంశాన్ని కోర్టు విచారణ సమయంలో సీబీఐను ప్రశ్నించింది. కోర్టు సంధించిన పలు ప్రశ్నలకు సీబీఐ సమాధానం ఇవ్వలేకపోయింది.

షరతులతో బెయిల్:ఇదే సమయంలో అవినాశ్ సీబీఐ తమను ఉద్దేశ పూర్వకంగా కుట్రలో ఇరికించిందని వాదించారు. ఏడు సార్లు విచారణకు హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ..సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని అవినాశ్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నెలలో తక్కువ సమయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన కారణంగా తను హాజరు కాలేకపోయానని వివరించారు.

తన తల్లి అనారోగ్యం కారణంగా తానే తన తల్లిని చూసుకోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు.సీబీఐ అర్దం లేని ఆరోపణలు చేస్తోందని కోర్టుకు వివరించారు. అవినాశ్ కు వ్యతిరేకంగా వైఎస్ సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు కొనసాగించారు. అవినాశ్, సునీత, సీబీఐ తరపు సుదీర్ఘ వాదనలను విన్న తరువాత హైకోర్టు ఈ రోజు తీర్పు కోసం వాయిదా వేసింది.

YS Avinash Reddy

విచారణకు సహకరించాలి:దీనికి అనుగుణంగా హైకోర్టు అవినాశ్ కు కండీషన్లతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టులకు వేసవి సెలవులకు ముందే అవినాశ్ తనను సీబీఐ అరెస్ట్ చేయుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ చేపట్టింది. విచారణలో అవినాశ్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సీబీఐ విచారణకు సహకరించాలని.. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు బెయిల్ కండీషన్లుగా స్పష్టం చేసింది.ప్రతీ శనివారం సీబీఐ ముందు హాజరు కావాలని న్యాయస్థానం సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+