YS Viveka Case: సునీత లక్ష్యంగా అవినాష్ మరో సంచలనం - ఇదీ అసలు కుట్ర..!!

కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సునీత తన భర్తను కాపాడుకోవటం కోసం తమ పైన నిందలు మోపుతున్నారని ఆరోపించారు. సీబీఐ వైఖరి గమనించి చూడాలని కోరారు. మరణించే ముందు రోజు వివేకా తనకు ప్రచారం చేసారని గుర్తు చేసారు.

మైదుకూరులో వివేకా తనకు మద్దతు గా ప్రచారం చేసారా లేదా అనేది విచారించాలని డిమాండ్ చేసారు. వ్యూహాత్మకంగా సాక్షులను ఎంచుకున్నారని ఆరోపించారు. ఒక తప్పు చేసి, ఇప్పుడు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 MP Avinash Reddy targets YS Sunitha, explains the conspiracy

వివేకా మద్దతుగా నిలిచారు:తనకు వివేకా మద్దతు చాలా అవసరమని..ఆయన పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారని అవినాష్ చెప్పుకొచ్చారు. తన పైన వివేకా హత్య కేసులో వస్తున్న ఆరోపణల పైన అవినాష్ వీడియో విడుదల చేసారు. అందులో సునీత, సీబీఐ తీరు పైన పలు ప్రశ్నలు సంధించారు. తన పైన ఆధారం లేని ఆభియోగాలు చేసారని వాపోయారు. గుగూల్ టేకవుట్ పేరుతో ఏం చేస్తున్నారో అర్దం కావటం లేదన్నారు.

తాము సునీత తో సహా సీబీఐ పైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. భర్తను కేసు నుంచి కాపాడుకోవటం కోసం సునీత ప్రయత్నం చేస్తున్నారని, తన భర్త స్థానంలో తన తండ్రిని..తనను ఇరికించేందుకు సునీత ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. హత్య చేసి ఒక తప్పు చేస్తే, ఇప్పుడు తమ వ్యక్తిత్వాలను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

భర్తను కాపాడుకోవటం కోసం:సునీత చంద్రబాబు సహకారంతో సీబీఐ మద్దతుతో తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అందరూ కలిసి ఉద్దేశ పూర్వకంగా తమ మీద అభియోగాలు మోపుతున్నారని వాపోయారు. తమ ద్వారా వైసీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పైన రాజకీయ పోరాటం చేయండి, ఇలా వ్యక్తిత్వ హననం చేస్తూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

మనుషులను ఢీఫేమ్ చేయటంలో సిద్ద హస్తులను పేర్కొన్నారు. ఇప్పటి దాకా తప్పుదోవ పట్టిన ఈ కేసును అంతిమంగా న్యాయం గెలిచేలా పోరాటం చేస్తూనే ఉంటామని అవినాష్ ప్రకటించారు. ఈ కేసులో సీబీఐ తమను ఇరిచేందుకు అవసరమైన సాక్ష్యాలను కూడా అనుకూలంగా మలచుకుందని చెప్పుకొచ్చారు. ఎంపీ టికెట్ కోసం ఈ హత్య జరిగిందని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో వాస్తవం లేదన్నారు.

సీబీఐ ఎందుకు ఆలోచించదు:హత్య జరిగే ముందు రోజున వివేకా మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం చేసారని అవినాష్ గుర్తు చేసారు. ఎమ్మెల్యే రఘునాధరెడ్డిని, ఎంపీగా తనను గెలిపించాలని కోరారని వివరించారు. సీబీఐ కావాలంటే మైదుకూరులో వివేకా ప్రచారంలో ఏం చెప్పారో ఆ ఇళ్లకు వెళ్లిల అడగాలని సూచించారు. కానీ, సీబీఐ ఆ పని చేయదన్నారు.

ఎంపీ టికెట్ అసలు అంశమే కాదని తేల్చి చెప్పారు. భర్తను కాపాడుకోవటం కోసం సంబంధం లేని వాళ్లను ఇందులో ఇరికించటం..తమ జీవితాలతో ఆడుకుంటారా అంటూ సునీతను అవినాష్ ప్రశ్నించారు. తమకు న్యాయం, దేవుడి పైన నమ్మకం ఉందని చెప్పారు. ప్రత్యక్షంగా..పరోక్షంగా ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు. నిజం దాగదన్నారు. సీబీఐ వాళ్లు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసారు. వివేకా తనకు ఎప్పుడూ బలమేనని అవినాష్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+