YS Viveka Case:సీబీఐ తీరుపై సుప్రీం సీరియస్ - కీలక ఆదేశాలు..!!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరు పైన సీరియస్ అయింది. తాము విచారణ పైన కోరిన నివేదికలో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం సీబీఐని ప్రశ్నించింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. సీబీఐ డైరక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ కోసం ఏప్రిల్ 10కి కేసు వాయిదా వేసింది.

వివేకానంద హత్య కేసులో దర్యాప్తు అధికారి విచారణ జాప్యం చేస్తున్నందున మార్చాలని హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటీషన్ గత వారం విచారించిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది.

YS Viveka Case: Supreme court angry with CBI,orders to change the inquiry officer

వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని, దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. త్వరగా విచారణ ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సీబీఐని అడిగింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. దర్యాప్తు తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలనిఆదేశించిన ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.

ఈ రోజు సీబీఐ సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. నివేదిక మొత్తం పరిశీంచామని చెబుతూ.. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని.. విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది.

విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. సీబీఐ డైరక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం నిర్దేశించింది. మొత్తంగా సీబీఐ విచారణ తీరు పైన అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదాకి వేస్తూ నిర్ణయం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+