YS Viveka case: అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరిన వైఎస్ సునీత..!?
వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కోర్టు విచారణ..ఇటు సీబీఐ ఇన్వెస్టిగేషన్ తో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. వైఎస్ అవినాష్ - వైఎస్ సునీత మధ్య ఈ కేసులో పోరు కొనసాగుతోంది. అవినాష్ లక్ష్యంగా సునీత కోర్టులో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. సునీత తన భర్తను రక్షించుకోవటం కోసం తమ పైన కుట్ర చేస్తున్నారని అవినాష్ ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు సునీత అప్పాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.
సునీత న్యాయ పోరాటం : వైఎస్ వివేకా కేసులో సునీత న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. నాడు సీబీఐ విచారణ కోరటం దగ్గర నుంచి నేడు అవినాష్ దాఖలు చేసిన ప్రతీ కేసులోనూ ఇంప్లీడ్ అవుతున్నారు. అటు అవినాష్ రెడ్డి ఈ కేసులో తమ ప్రమేయం లేదని వాదిస్తున్నారు. వివేకా తనకు అండగా నిలిచారని, ఎంపీ టికెట్ అంశమే కాదని చెప్పుకొచ్చారు.

ఇదంతా తన భర్త రాజశేఖరరెడ్డి కోసం తమను సునీత ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆరోపణ లు చేసారు. సునీత చేస్తున్న కుట్ర పైన న్యాయ పరంగా ఎప్పటి దాకా అయినా పోరాటం చేస్తామని అవినాష్ ప్రకటించారు. వివేకా ను హత్య చేయటం ఒక తప్పయితే, తమ వ్యక్తిత్వ హననం చేసే విధంగా వ్యవహరించటం మరో తప్పుగా పేర్కొన్నారు.
అవినాష్ కీలక వ్యాఖ్యలు : చంద్రబాబుతో కలిసి సునీత ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ సమయంలోనూ తమ వాదనలు వినాలని సునీత కోరారు. శుక్రవారం సునీత తరపు వాదనలు కొనసాగే అవకాశం ఉంది.
ఇదే సమయంలో సునీత మరో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వస నీయ సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరినట్లు ప్రచారం సాగుతోంది. షా అప్పాయింట్ మెంట్ ఖరారైతే తన తండ్రి వివేకా హత్య కేసులో పారదర్శకంగా విచారణ చేయించి, బాధ్యలను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెబుతున్నారు.

కీలక దశకు విచారణ : వివేకా కేసులో ఇప్పుడు పోరాటం అక్కా..తమ్ముళ్ల మధ్య యుద్దంగా మారింది. ఇప్పటి వరకు తాము వైఎస్ వివేకా మరణంతో ఆ కుటుంబం గురించి ఎప్పుడూ ప్రస్తావన చేయలేదని, ఇప్పుడు తమ పైన కుట్ర చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సునీత ఇప్పుడు అవినాష్ చేస్తున్న ఆరోపణల పైన నేరుగా స్పందించటం లేదు.
కానీ, న్యాయస్థానాల ద్వారా పోరాటం కొనసాగిస్తున్నారు. అవినాష్ వేసిన కేసుల్లో తాను ఇంప్లీడ్ అయి తన వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిల కూడా సునీతకు మద్దతుగా నిలిచారు. కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications