YS Vivekananda Reddy Case: హంతకులు వారేనా.. గుట్టు విప్పిన దస్తగిరి-పట్టు చిక్కిన సీబీఐ

కడప : మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో భారీ ట్విస్టు చోటుచేసుకుంది. ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి వాంగ్మూలం కీలకంగా మారింది. ఇక ఈ కేసుపై సీఎం జగన్‌ స్పందించాలంటూ ప్రతిపక్షాలు కూడా పలుమార్లు డిమాండ్ చేశాయి. అయితే ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎట్టకేలకు పట్టు బిగించింది. వివేకా హత్య కేసులో ఎక్కడా మిస్ కాకుండా సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వచ్చింది. చివరకు వివేకా కారు డ్రైవర్ దస్తగిరి పేరుతో కడప సబ్‌కోర్టులో సీబీఐ అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసింది.

 పూసగుచ్చినట్లు చెప్పిన డ్రైవర్ దస్తగిరి

పూసగుచ్చినట్లు చెప్పిన డ్రైవర్ దస్తగిరి

వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.. దస్తగిరి స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు అందజేసింది. ఈ స్టేట్‌మెంట్‌లో పలువురి బడా నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్టేట్‌మెంట్ ప్రకారం వివేకా హత్య ఎలా జరిగింది.. ప్రణాళిక మొత్తం పూసగుచ్చినట్లు సీబీఐకి దస్తగిరి వివరించినట్లు తెలుస్తోంది. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి చెప్పినట్లు సీబీఐ స్టేట్‌మెంట్‌లో రికార్డు చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు చెప్పిన దస్తగిరి దీనికి మొత్తం మూలం బెంగళూరులోని భూవివాదమే అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. బెంగళూరు భూమిలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయాడని దస్తగిరి చెప్పినట్లు తెలుస్తోంది.

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే...

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికోసం ఓ ప్రజాప్రతినిధితో పాటు ఎర్ర గంగిరెడ్డి కృషి చేశారని... దీంతో వివేకా వారికి వార్నింగ్ ఇచ్చినట్లు దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. ఇక ఓటమి తర్వాత ఆ ప్రజాప్రతినిధి ఇంటి వద్ద వాగ్వాదం కూడా జరిగిందని అదే సమయంలో పలువురిని వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని తన ఆఫీసుకు పిలిపించుకుని వివేకా దూషించారని ఆయన పేర్కొన్నాడు.ఇక అప్పటి నుంచి ఎర్రగంగిరెడ్డి, వైయస్ వివేకా మధ్య సంబంధాలు తెగిపోయాయని , ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పాడు.

 హత్యకు ముందు ఏం జరిగింది

హత్యకు ముందు ఏం జరిగింది

ఇక ఈ హత్యకు మొత్తం రూ.40 కోట్లు సుపారి ఇచ్చినట్లు దస్తగిరి చెప్పాడు. తనకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పి అందులో భాగంగా ముందుగా రూ.కోటి చెల్లించినట్లు దస్తగిరి చెప్పుకొచ్చాడు. ఇది ఎర్ర గంగిరెడ్డి ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.ఇక తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో రూ.25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకోగా మిగతా రూ.75 లక్షలు తన స్నేహితుడైన మున్నా వద్ద దాచినట్లు దస్తగిరి ఒప్పుకున్నాడు. ఇక హత్యకు ముందు సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి కలసి వివేకానందరెడ్డి ఇంట్లో ఉండే కుక్కను చంపేశారని దస్తగిరి చెప్పాడు. ఇక ముందుగానే వివేకా ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి మాటు వేసి ఉన్నాడని.. ఆ తర్వాత సునీల్ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్‌ వాల్ దూకి లోపలికి వెళ్లినట్లు చెప్పాడు. ఇలా వివేకా హత్య ఎలా జరిగిందో సీన్ టూ సీన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వివరించాడు. ఇక దస్తగిరి వాంగ్మూలం ఈ కేసుకు కీలకంగా మారింది. ఇందులో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరో, వారి పాత్ర ఏమేరకు ఉందో అనే అంశాన్ని సీబీఐ త్వరలో తేల్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+