కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా కేసులో కొత్త ట్విస్టులు-రంగన్న ఆరోపణలు ఖండించిన గంగిరెడ్డి-ఆ రోజు జరిగిందిదీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఓవైపు సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో డొంక కదులుతోంది. ఇప్పటివరకూ వివేకా హంతకులు ఎవరు, వారి వెనుక ఎవరున్నారనే అంశాలపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐ ఆయన ఇంటి వాచ్ మెన్ రంగన్నను జమ్మలమడుగు కోర్టులో హాజరుపర్చడంతో ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తీరుగుతోంది. వివేకా హత్యలో పాత్రధారిగా రంగన్న ఆరోపించిన ఆయన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ఈ ఆరోపణల్ని ఖండించారు.

 వివేకా హత్య కేసులో తాజా ట్విస్టులు

వివేకా హత్య కేసులో తాజా ట్విస్టులు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తాజాగా సీబీఐ పురోగతి సాధించడంతో ఈ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఈ కేసులో హంతకుల గురించి కానీ, వారి వెనుక ఉన్న ప్రముఖుల గురించి కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదని భావిస్తున్న తరుణంలో వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం మొత్తం కేసు దర్యాప్తునే ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. రంగన్న ఇచ్చిన వాంగూల్మంపై వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి స్పందించారు.

రంగన్న ఆరోపణలు ఖండించిన ఎర్ర గంగిరెడ్డి

రంగన్న ఆరోపణలు ఖండించిన ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై తాజాగా ఆయన ఇంటి వాచ్ మెన్ రంగన్న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి పేరును ప్రస్తావించారు. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు రంగన్న వాంగ్మూలంలో చెప్పారు. దీంతో ఎర్ర గంగిరెడ్డి ఇవాళ రంగన్న వాంగ్మూలంపై స్పందించారు. రంగన్న ఎవరో తెలియదని, ఆయన్ను తాను ఎందుకు బెదిరిస్తానని గంగిరెడ్డి పేర్కొన్నారు.

మద్యం మత్తులో రంగన్న వ్యాఖ్యలు

వివేకానందరెడ్డి వాచ్ మన్ రంగన్న నిన్న జమ్మలమడుగు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి పేరు ప్రస్తావించిన నేపథ్యంలో స్పందించిన ఆయన... రంగన్నతో తనకు పెద్దగా పరిచయం లేదన్నారు. రంగన్న నిన్న మద్యం మత్తులో మాట్లాడారని ఎర్ర గంగిరెడ్డి ఆరోపించారు. వివేకాను ఎదిరించే ధైర్యమే తనకు లేదని, అలాంటిది ఆయన హత్య కేసులో తన ప్రమేయం ఉందని రంగన్న చెప్పడం దారుణమని గంగిరెడ్డి పేర్కొన్నారు.

వివేకా హత్యతో సంబంధం లేదన్న గంగిరెడ్డి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణపై స్పందించిన గంగిరెడ్డి... ఈ హత్య జరిగిన విషయం తనకు తర్వాత రోజే తెలిసిందన్నారు. వివేకా బావమరిది ఫోన్ చేసి మీ సారు చనిపోయారని తనకు చెప్పారని గంగిరెడ్డి వెల్లడించారు. అలాగే వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా తన నుంచి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు.

వివేకా హత్య రోజు ఏం జరిగిందంటే ?

వివేకా హత్య రోజు ఏం జరిగిందంటే ?

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలను ఎర్ర గంగిరెడ్డి పూసగుచ్చినట్లు వెల్లడించారు.
హత్య జరిగిన రోజు రాత్రి వివేకా దగ్గర నుంచి తాను ఆలస్యంగా ఇంటికి వచ్చానని గంగిరెడ్డి తెలిపారు. అందువల్ల ఉదయం లేటుగా లేచినట్లు వెల్లడించారు. వివేకా భావమరిది నాకు పోనే చేసి మీ సార్ చనిపోయాడని చెబితేనే తనకు విషయం తెలిసిందన్నారు. అలాగే బెంగుళూర్ స్థల వివాదం వివేకా చనిపోక రెండు నెలల ముందే పరిష్కారమైందని కూడా గంగిరెడ్డి వెల్లడించారు.

English summary
former minister ys vivenkanandareddy's close aid erra gangireddy on today condemns watchman ranganna's allegations on the murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X