రూ.కోటి ఇస్తే..: చంద్రబాబు దుమ్ముదులిపిన వైయస్ వివేకా, 'ఖరీదైన సీఎం'
కడప: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం నాడు విరుచుకుపడ్డారు. ఏపీలో టిడిపి ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఇచ్చి కొనుగోలు చేసిందని ఆరోపించారు.
అందుకే మేం రాజకీయాల్లో ఉన్నాం: వైయస్ వివేకానంద రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక్కో ఎంపీటీసీకి రూ.కోటి ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఆయన కడప జిల్లా కమలాపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, తాము ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాలలో ఉన్నామని వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవల అన్న విషయం తెలిసిందే. తాము అధికారాన్ని అనుభవించడానికి రాజకీయాల్లో లేమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

దేశంలో ఖరీదైన సీఎం చంద్రబాబు
ఓ వైపు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ, మరోవైపు చేతికి ఎముకే లేనట్లు చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు. దేశంలో ఖరీదైన సీఎం చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications