ఈ లెక్కన టీడీపీ మళ్లీ ఓడిపోవడం ఖాయం
ఏపీలో ఎన్నికలు ముగియడంతో ఫలితాల కోసం నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఈసారి సైలెంట్ ఓటింగ్ జరగడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందో విశ్లేషకులు సైతం చెప్పలేకపోతున్నారు. అయితే గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేతలు మరో అడుగు ముందుకేసి సీఎంగా ప్రమాణస్వీకారం ముహూర్తం తేదీలు కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనలో ఉండగా, టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికాలో రిలాక్స్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఐపీఎల్‌తో లింక్ పెడుతూ ఏపీ రాజకీయ ఫలితాలపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా టీడీపీలో పసుపు రంగు ఉంటుంది. ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా ఎక్కువగా పసుపుకు సంబంధించిన దుస్తులనే ధరిస్తుంటారు. ఇక క్రికెట్‌లో కూడా వారు ఆ రంగు జెర్సీ ధరించిన సీఎస్‌కే టీంనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సీఎస్‌కే టీంకు మద్దతుగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు దీనికి కౌంటరిస్తోంది వైసీపీ.

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని..ఆ సంవత్సరం జరిగిన ఐపీఎల్‌లో సీఎస్‌కే ఫైనల్‌లో ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఇక సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్‌లో సీఎస్‌కే జట్టు ప్లే ఆఫ్‌కు కూడా చేరకుండానే వెనుతిరిగింది. దీంతో ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో టీడీపీ కూడా ఓడిపోతుందని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇరు వర్గాలు కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఐపీఎల్ జాతకం నిజమవుతుందో లేదో తెలియాలంటే జూన్ 4న వెలువడే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications