నాన్న ఆశయ సాధన కోసం దేనికైనా, ఎందాకైనా - ప్రజల మదిలో రాజన్న..!!

యాడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. వైఎస్సార్. ఈ పేరు ఒక సంచలనం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మధ్య నుంచి దూరమై 14 సంవత్సరాలు అవుతోంది. కానీ పథకాలు..సంక్షేమం పేరుతో ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నారు. రాష్ట్రంలో నిత్యం ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది. మరణించినా ప్రజల మనస్సుల్లో నిలిచిన వైఎస్సార్ తనకు స్పూర్తి అని సీఎం జగన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మ్ముకున్న వారి కోసం కష్టాలతో యుద్ధం చేసే అరుదైన నాయకత్వం ఆయన సొంతం.

దివంగత వైఎస్సార్ జన్మదినం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. సీఎం జగన్ ఇడుపులపాయలో తన తండ్రి ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు. వైఎస్సార్ జన్మదినాన్ని ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది. వైఎస్సార్ తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసారు. రాజకీయం..నాయకత్వం రెండు వేర్వేరుగా తన పాలనలో చూపించిన అరుదైన నేతగా వైస్సార్ నిలిచిపోతారు.సంక్షేమ సారధిని.. అభివృద్ధికి వారధిని అంటూ తనను పునర్ లిఖించుకున్న అరుదైన నేతగా వైఎస్సార్ గుర్తింపు పొందారు. పేదలు..నమ్ముకున్న వారి కోసం కష్టాలతో యుద్ధం చేసేందుకు నేనున్నానంటూ పోరాడే సైనికుడుగా వైఎస్సార్ ఎప్పటికీ గుర్తిండిపోతారు.

jagan

తన అయిదేళ్ల పాలనలో ఒక సామాజిక శాస్త్రవేత్తగా మారారు. పార్టీ ఇచ్చిన పాత కాలపు ఎజెండా కాపీలను చించేసి..ప్రజల ఎజెండాను జెండాగా చేసి సమున్నతంగా ఎగరేసి ఇంటింటా కొలువైన మానవ రూపంలో దేవుడిగా నిలిచిన నిలువెత్తు మానవత్వంగా నిలిచారు. వైఎస్సార్ లేకున్నా..ఆయన అమలు చేసిన సంక్షేమం ..పథకాలు అయన్న ఎప్పటికీ ప్రజల మనస్సులో నిలబెడతాయి. ఆరోగ్యశ్రీతో పేదలకు భరోసా ఇచ్చారు. ఇదిగో ఈ కార్డు ఉంచు.. ఏ ఆస్పత్రి అయినా నీకు ఎదురేగి వైద్యం చేస్తుంది అని చెప్పి ముందుకు సాగిన పెద్దాయన ఎన్నో వేల గుండెలకు ప్రాణం పోశారు. పేదింటి పిల్ల‌లు కూడా పెద్ద చ‌ద‌వులు చ‌ద‌వాల‌న్న స‌ముచిత ల‌క్ష్యంతో ఆనాడు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని మొద‌లు పెట్టి వారి బతుకులు మార్చిన సీఎంగా నిలిచిపోయారు.

తు సంక్షేమం, నీటి వనరుల నిర్వహణ.. నిర్మాణం.. ఓ ప్రధాన బాధ్యత కావాలంటూ జలయజ్ఞాన్ని ప్రారంభించి లక్షల ఎకరాలకు నీళ్ళు పారించి రాష్ట్రంలో సిరులు పండించేందుకు శ్రీకారం చుట్టారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి.. ప్రతి గుండెకు.. ప్రతి మమసుకు చేరువయ్యేలా పరిపాలించారు. ఆయన మరణించి ప్రజల గుండెల్లో జీవించి ఉన్నారు. సంక్షేమ వరాలు కురిపించి ఆయన మన కళ్ళముందే అంతర్థానమైపోయారు. వైయస్సార్ ఆశయాలు ఆలోచనలు కొనసాగిస్తూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటా సంతోషాలు నింపే బాధ్యత ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+