త్వరలోనే ఎన్నికలు, బాబుకు బుద్ధి జ్ఞానం ఉందా?: వైయస్ జగన్(పిక్చర్స్)
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని రైతుల కష్టాలు పట్టడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపటం ఖాయమని జోస్యం చెప్పారు.
ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొదలవారిపాలెంలో అప్పులబాధ తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని, జరుగుమల్లి మండలం చింతలపాలెం రైతు మిడసల కొండలరావు కుటుంబాన్ని, వలేటిపాలెం మండలం కొండసముద్రంకు చెందిన నీలం వెంకట్రావు కుటుంబాన్ని జగన్ బుధవారం పరామర్శించారు.
పార్టీపరంగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టంగుటూరులోని టుబాకో బోర్డు కార్యాలయం ఎదుట కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, బోర్డు వైఫల్యాలను నిరసిస్తూ మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాల వల్లనే పొగాకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని జగన్ ధ్వజమెత్తారు.
సిఎం చంద్రబాబునాయుడు పొగాకు రైతులు, మిగిలిన రైతులను ఆదుకోవటంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. రైతులను ఆదుకోలేని చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే అన్ని రైతు రుణాలను మాఫీ చేస్తానన్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.
పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబుకు చీమకుట్టినట్లైనా లేదని ఆయన ఆరోపించారు. బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం తగ్గిందని, అయినా ధరలు మాత్రం పెరగకపోవటాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు.

వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని రైతుల కష్టాలు పట్టడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపటం ఖాయమని జోస్యం చెప్పారు.

వైయస్ జగన్
పొగాకు కొనుగోళ్లుప్రారంభమై పదినెలలు గడుస్తుండటంతో పొగాకు నాణ్యత తగ్గి ధరలు పతనమవుతుండటంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన దుమ్మెత్తిపోశారు.

వైయస్ జగన్
ఈ సందర్భంగా టంగుటూరులోని టుబాకో బోర్డు కార్యాలయం ఎదుట కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, బోర్డు వైఫల్యాలను నిరసిస్తూ మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు.

వైయస్ జగన్
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాల వల్లనే పొగాకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని జగన్ ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
సిఎం చంద్రబాబునాయుడు పొగాకు రైతులు, మిగిలిన రైతులను ఆదుకోవటంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు.

వైయస్ జగన్
రైతులను ఆదుకోలేని చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు.

వైయస్ జగన్
తాను అధికారంలోకి వస్తే అన్ని రైతు రుణాలను మాఫీ చేస్తానన్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
సిఎం చంద్రబాబునాయుడు పొగాకు రైతులు, మిగిలిన రైతులను ఆదుకోవటంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు.
పొగాకు కొనుగోళ్లుప్రారంభమై పదినెలలు గడుస్తుండటంతో పొగాకు నాణ్యత తగ్గి ధరలు పతనమవుతుండటంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బ్యాంకులు కూడా రైతులకు రుణాలను బాగా తగ్గించాయని దీంతో రైతులు బయటకు వడ్డీలకు అప్పులు తీసుకుని చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications