మద్యం, నగదు పట్టివేత: జగన్ పార్టీ నేతల అరెస్టు

ఇదిలావుంటే, అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండలం గొంగటపల్లిలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన నేతలు గొంగటపల్లి వద్ద ఎదురుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణుల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు.
అనంతపురం జిల్లాలోని రొళ్ల మండలం రత్నగిరి వద్ద పోలీసులు తనిఖీల్లో 200 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. వీటిని తరలిస్తున్న ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం ఎలమర్రులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత నివాసంలో పోలీసుల సోదాలో భారీగా నగదు లభ్యమైంది. రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం వద్ద మద్యం సీసాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ సిఐ శివకుమారి బృందం అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 440 మద్యం సీసాలను, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రావూరు నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏటూరుకు మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సిఐ చెప్పారు.












Click it and Unblock the Notifications