హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శోభా ధర్నా, 'జగన్' ఎమ్మెల్యేను ఎత్తుకెళ్లారు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయాలన్న తమ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సి బ్లాక్ కార్యాలయం వద్ద శుక్రవారం సచివాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు ధర్నా నిర్వహించారు.

కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు శోభానాగి రెడ్డి, సుచరిత, శ్రీకాంత్ రెడ్డి, గొల్ల బాబూరావు, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు.

కేంద్రం నుంచి శాసనసభకు రాష్ట్ర విభజనపై బిల్లు రాకుండా ముందే ఇక్కడ సభను సమావేశపరిచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వ్యవహరించాలని శోభానాగి రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. తీర్మానం కుదరదని ముఖ్యమంత్రి చెప్పడంతో వారు ధర్నాకు దిగారు.

వైయస్సార్ కాంగ్రెసు 1

వైయస్సార్ కాంగ్రెసు 1

రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయాలన్న తమ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సి బ్లాక్ కార్యాలయం వద్ద శుక్రవారం సచివాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు 2

వైయస్సార్ కాంగ్రెసు 2

శుక్రవారం సచివాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సి బ్లాక్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

వైయస్సార్ కాంగ్రెసు 3

వైయస్సార్ కాంగ్రెసు 3

రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయాలన్న తమ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సి బ్లాక్ కార్యాలయం వద్ద శుక్రవారం సచివాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు 4

వైయస్సార్ కాంగ్రెసు 4

ధర్నాలో ఎమ్మెల్యేలు శోభానాగి రెడ్డి, సుచరిత, శ్రీకాంత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు సి బ్లాక్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రసు 5

వైయస్సార్ కాంగ్రసు 5

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల ధర్నాతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

వైయస్సార్ కాంగ్రెసు 6

వైయస్సార్ కాంగ్రెసు 6

కేంద్రం నుంచి శాసన సభకు రాష్ట్ర విభజనపై బిల్లు రాకుండా ముందే ఇక్కడ సభను సమావేశపరిచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయించాలని ముఖ్యమంత్రిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు కోరితే కిరణ్ కుదరదని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు 7

వైయస్సార్ కాంగ్రెసు 7

విభజన వల్ల ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని, తమ పార్టీకి అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, రాష్ట్రంలో 60 శాతం జనాభా విభజనను కోరుకోవడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు 8

వైయస్సార్ కాంగ్రెసు 8

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల ధర్నాతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

English summary
YSR Congress party MLAs were taken into custody by the police when they staged dharna before Chief Minister N. Kiran Kumar Reddy's office in the State Secretariat demanding convening of a Special Assembly session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X