పోరాటం చేస్తే రాదనేది లేదు: జగన్ నోట పదే పదే కేసీఆర్ మాట

అమరావతి: కేంద్ర ప్రకటనను స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడాన్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు.

ఏపీ అసెంబ్లీ మూడో రోజు కూడా నిరవధిక వాయిదా పడటంతో ప్రతిపక్షనేత జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు పుట్‌పాత్‌పై బైఠాయించారు. ఈ ధర్నాలో జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు.

 YSR Congress MLAs elect stage dharna in front of gandhi statue

అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై చర్చ జరగకుండా అధికార పక్షం అడ్డుకుందని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీకి హోదా సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడంతో పాటు జైట్లీ ప్రకటనపై పోరాటం చేయకుండా స్వాగతిస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో కనసాగేందుకు చంద్రబాబు అనర్హుడన్నారు. ఏపీకి హోదా సాధనకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదాపై రాజీపడిన చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ కేంద్ర మంత్రులను ఉపసంహరించాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ప్రత్యేకహోదా అంశంపై అసెంబ్లీ చర్చ జరపమంటే చర్చ లేకుండా స్టేట్ మెంట్లు ఇస్తామంటారన్నారు.

ఎన్నిసార్లు స్టేట్ మెంట్లు ఇస్తారని నిలదీశారు. ప్రత్యేకహోదా అంశాన్ని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఉద్యమాల ద్వారా సాధించుకున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+