అరెస్ట్: చీరకప్పుకొని వెళ్లాలా, బాలకృష్ణకు అవమానం: రోజా (పిక్చర్స్)
హైదరాబాద్: శాసన సభలో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షంపై అధికార టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా సోమవారం అన్నారు. ప్రభుత్వంతో పాటు స్పీకర్ వైఖరిరిని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుండి అసెంబ్లీకి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.
సభలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే కరెక్ట్.. మేం మాత్రం ఆడవాళ్లమంటూ చీర కప్పుకొని వెళ్లాలంటా.. ఇదేమీ అన్యాయమని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. అసెంబ్లీ ఫుటేజిని పరిశీలిస్తే మంత్రి అన్న తర్వాతే తాను మాట్లాడానని, తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుస్తుందన్నారు.
కళాకారిణి అయిన తనను అవమానిస్తే ఎన్టీఆర్, బాలకృష్ణలను కూడా అవమానించినట్లేనని ఆమె చెప్పారు. కళాకారుడు పెట్టిన పార్టీలో పుట్టి తన పైన వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. బాలకృష్ణ కూడా నటుడేనని, ఓ ఆర్టిస్ట్ గురించి అలా మాట్లాడుతుంటే స్పీకర్ ఖండించకపోగా హోల్డ్ యువర్ టంగ్ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్
అసెంబ్లీ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం నాడు ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెస్
అసెంబ్లీ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం నాడు ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల దృశ్యం. ప్లకార్డులు పట్టుకున్న దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెస్
అసెంబ్లీ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం నాడు ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల దృశ్యం. ఈ సందర్భంగా మాట్లాడుతున్న రోజా.

వైయస్సార్ కాంగ్రెస్
అసెంబ్లీ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం నాడు ఆందోళన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల దృశ్యం.












Click it and Unblock the Notifications