వైసీపీకి పొంచివున్న వేణుస్వామి ముప్పు?
ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు తన వాక్చాతుర్యంతో జ్యోతిష్యాలు చెబుతుండే వివాదాస్పద వ్యక్తి వేణుస్వామి. వాస్తవానికి ఈయన చెప్పిన వాటిల్లో 100కు 99 జరగవు. ఆ ఒకటి కూడా ఎందుకు జరుగుతుందంటే దానంతటదే జరుగుతుంది కాబట్టి దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. రాజకీయ రంగంలో, సినీ రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెబుతూ, తనను తాను ప్రమోట్ చేసుకుంటూ ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడిలా మారిపోయాడు. నెటిజన్లు మాత్రం ప్రతిరోజు ఇతన్ని ఏకిపారేస్తుంటారు. అయినా సరే.. వేణుస్వామి మాత్రం వెనక్కి తగ్గడు.. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతుంటాడు.. అవి టెలికాస్ట్ అవుతుంటాయి.
2029లో కూడా జగనే గెలుస్తాడంట
ఐపీఎల్ ఫైనల్ లో కావ్యమారన్ జాతకం ప్రకారం హైదరాబాద్ గెలుస్తుందని చెప్పాడు. ఆ జట్టు దారుణంగా ఓటమిపాలైంది. కనీసం పోటీకూడా ఇవ్వలేకపోయింది. ఈ వేణుస్వామే మూడునెలల నుంచి ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తాడని బాకా ఊదుతున్నాడు. వైసీపీకి అనుబంధంగా పనిచేసే యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. జగన్ జాతకం బాగుందని 2024లో గెలవడంతోపాటు 2029 ఎన్నికల్లో కూడా గెలుస్తాడని ముఖ్యమంత్రి అవుతాడంటూ బల్లగుద్ది చెబుతున్నాడు. ఆ బల్లమీద మందు గ్లాసులుంటాయనేది వేరే విషయం.

నీ చావు ఎప్పుడు వేణుస్వామి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయం సాధిస్తారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఒకటే ఊదరగొట్టాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరెక్కడా నోరెత్తలేదు. ఆ హీరో చనిపోతాడు.. ఆ హీరోయిన్ చనిపోతుందంటూ జాతకాలు చెబుతుండే వేణుస్వామిని నెటిజన్లు నీ చావు ఎప్పుడు? అని ప్రశ్నిస్తుంటారు. ప్రస్తుతం ఇతన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వణికిపోతున్నాయి. జ్యోతిష్యంమీద మంచి పట్టుండే ఎందరో పండితులు ఎప్పుడూ సెలబ్రిటీలు అవలేదు. వారి పని వారు చేసుకుంటూ పోతుంటారు. కానీ వేణుస్వామిలాంటివారే జ్యోతిష్యంమీద పట్టులేకపోయినా తెలిసిన నాలుగు మంత్రాలతో తనను తాను ప్రమోట్ చేసుకుంటుంటాడు. ఐపీఎల్ ఫైనల్ లో హైదరాబాద్ ఓడిపోయింది.. అలాగే ఏపీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోతుందా? అనే దిగులుతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. మరోవైపు ఈ శ్రేణులు వేణుస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.












Click it and Unblock the Notifications