కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆశ్చర్యం: మహానాడులో వైసిపి నాయకుడు, గద్దెకు చంద్రబాబు ఝలక్

విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయుకుడు హాజరయ్యారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

|
Google Oneindia TeluguNews

విశాఖ: విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయుకుడు హాజరయ్యారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండుగ. దీనిని మూడు రోజులు నిర్వహిస్తారు. ఇలాంటి టిడిపి వేడుకకు వైసిపి నాయకుడు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

<strong>'నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు అవమానం, అందుకే ఈ వాదన'</strong>'నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు అవమానం, అందుకే ఈ వాదన'

కుప్పం మండలం అనిమిగానిపల్లె వైస్ సర్పంచ్, వైసిపి నేత ఇలయరాజా విశాఖలో జరుగుతున్న మహానాడుకు హాజరయ్యారు. ఇలయరాజా వైసిపిలో ఉంటూ ఎంపిటిసి అభ్యర్థిగా, సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీ చేశారు. అతను మహానాడులో కనిపించారు. ఆయన టిడిపిలో చేరుతారని అంటున్నారు.

గద్దె బాబురావు చంద్రబాబు ఝలక్

గద్దె బాబురావు చంద్రబాబు ఝలక్

వినేవారిని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడం నేతలు నేర్చుకోవాలని, ఆ తర్వాతనే వేదిక ఎక్కాలని చంద్రబాబు నాయుడు ఆదివారం సూచించారు. పసలేని ప్రసంగాలతో కార్యకర్తలకు బోర్ కొట్టిస్తే ఎలా? అని ప్రశ్నించారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు సుదీర్ఘంగా మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది.

ఆకట్టుకునేలా లేకపోవడంతో..

ఆకట్టుకునేలా లేకపోవడంతో..

గద్దె బాబురావు మాట్లాడుతున్న అంశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడంతో చంద్రబాబు కల్పించుకున్నారు. వేలాది మంది కూర్చున్న సభలో ఇలా మాట్లాడటం ఏమిటని బాబూరావును ప్రశ్నించారు. అందరికీ నచ్చేలా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. ఆ వెంటనే మహానాడు నిర్వాహకులు గద్దె బాబూరావు నుంచి మైక్ తీసుకుని మరొకరిని ప్రసంగించేందుకు పిలిచారు.

ఎన్టీఆర్‌పై..

ఎన్టీఆర్‌పై..

ఎన్టీఆర్‌ యుగ పురుషుడని, ఆయన పుట్టుక ఒక సందేశమని, ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని, ఆయనను తలచుకుని ఏ కార్యక్రమం చేసినా విజయవంతమవుతుందని చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం దేశానికే గౌరవమని, దీనిని ఏకగ్రీవంగా తీర్మానించాలన్నారు.

ప్రజల అభీష్టం ఢిల్లీ వరకు వినిపించాలి

ప్రజల అభీష్టం ఢిల్లీ వరకు వినిపించాలి

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ పరకాల ప్రభాకర్‌ తీర్మానం ప్రవేశపెట్టగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు, తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్‌ రమణ బలపరిచారు. జాప్యం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. మహానాడులో ప్రజల అభీష్టం ఢిల్లీ వరకు వినిపించాలన్నారు.

English summary
YSR Congress Party Kuppam leader in Telugudesam Party Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X