రాజీనామాలు ఆమోదించండి: స్పీకర్‌కు వైసీపీ ఎంపీల లేఖ
న్యూఢిల్లీ: తమ రాజీనామాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరోసారి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు బుధవారం లేఖ రాశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని లేఖలో మరోసారి స్పీకర్‌ను కోరారు.

'గత నెల 29న రాజీనామాలపై పురాలోచన చేయాలని మీరు కోరారు.. మీ సలహాకు ధన్యవాదాలు. కానీ, మేం రాజీనామాలకే కట్టుబడి ఉన్నాం. 16వ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాం. తక్షణమే మా రాజీనామాలు ఆమోదించండి' అని లేఖలో వైయస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు.
ఈ మేరకు తమ రాజీనామాలను మరోసారి ధ్రువీకరిస్తూ.. ఎంపీలు స్పీకర్ కార్యాలయంలో ఎంపీలు లేఖలు అందంజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వైయస్సార్ సీపీ ఎంపీలు ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications