జగన్ - షర్మిల వివాదానికి ఎండ్ కార్డ్-వైసీపీ ఆఫర్ ఇదే-సంచలన ట్వీట్..!

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్న తన షేర్లు బదిలీ కాకుండా చూడాలని జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ ను జగన్ ఆశ్రయించడంతో మొదలైన ఈ పోరు.. చినికి చినికి గాలివానగా మారి ప్రతి రోజూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం, తిరిగి షర్మిల ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించడం పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆమెకు ఓ ఆఫర్ ఇచ్చింది.

డైవర్షన్‌ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం అంటూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు ఇస్తున్నట్లు వైసీపీ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇందులో పార్టీ నేతలకు చెబుతున్నట్లు అంతా చెప్పి, చివర్లో మాత్రం వైఎస్ షర్మిలకు ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని ప్రతిపాదించింది. ఈ ట్వీట్ లో మొత్తం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదని, పాలనలో విఫలమవుతోందని విమర్శలు గుప్పించింది. చివర్లో మాత్రం షర్మిల వద్దకు వచ్చింది.

ysr congress party offers ys Sharmila to end war with ys jagan in a tweet

వైయస్‌ఆర్‌ కుటుంబంలో వ్యక్తిగత అంశాలనూ కూడా రచ్చకీడ్చి, వాటిని వక్రీకరించి జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయాలనే చంద్రబాబు, ఆయన మీడియా దుర్భుద్దిని ఎండగట్టక తప్పలేదని ఈ ట్వీట్ లో వైసీపీ తెలిపింది. ఈ అంశంపై అన్ని వివరాలను ఇప్పటికే ప్రజలముందు ఉంచామని, ఇప్పుడు ఎవరిది మంచి? ఎవరిది చెడు? అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారని, అంతేకాకుండా ఈ వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నందున, ఇక వాదనలు ఏవైనా కోర్టుల్లోనే చేసుకునే వెసులుబాటు ఎవరికైనా ఉన్నందున, దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+