శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళకు జగన్ ఓదార్పు: 2నెలలు ఆగండని..(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: రెండు నెలలు ఓపిక పడితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. తను పేద ప్రజల బాధలు తీరాస్తానని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురంలలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ అజెండాను వారికి వివరించారు.

వృద్ధాప్య పింఛన్‌ను రూ. 700కు పెంచడం, వికలాంగుల పింఛన్‌ను రూ. 1,000 చేయడం, డ్వాక్రా రుణాల రద్దు, అందరికీ ఇళ్లు నిర్మిస్తామని ప్రజలకు జగన్ హామి ఇచ్చారు. జిల్లాలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను రద్దు చేస్తానని జగన్ పునరుద్ఘాటించారు. మత్స్యకారులను ఎస్టిలలో, కళింగ కోమట్లను బిసిల్లో చేరుస్తానని హామి ఇచ్చారు.

ఇచ్ఛాపురం రోడ్‌షోలో మాట్లాడుతూ.. కండ్ర కులస్తులను ఎస్సిలలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటానని జగన్ చెప్పారు. శ్రీకాకుళం పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.వి కృష్ణారావు, పిరియా సాయిరాజ్, జిల్లా పార్టీ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి, శ్రీకాకుళం ఎంపి అభ్యర్థి రెడ్డి శాంతి, ఇతర నేతలు ఉన్నారు.

వృద్ధిరాలితో ముచ్చటిస్తూ..

వృద్ధిరాలితో ముచ్చటిస్తూ..

రెండు నెలలు ఓపిక పడితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. తను పేద ప్రజల బాధలు తీరాస్తానని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురంలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు.

రోడ్‌షోలో..

రోడ్‌షోలో..

ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ అజెండాను వారికి వివరించారు.

మహిళకు పలకరింపు..

మహిళకు పలకరింపు..

వృద్ధాప్య పింఛన్‌ను రూ. 700కు పెంచడం, వికలాంగుల పింఛన్‌ను రూ. 1,000 చేయడం, డ్వాక్రా రుణాల రద్దు, అందరికీ ఇళ్లు నిర్మిస్తామని ప్రజలకు జగన్ హామి ఇచ్చారు.

మహిళను ఓదారుస్తూ..

మహిళను ఓదారుస్తూ..

శ్రీకాకుళం జిల్లాలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను రద్దు చేస్తానని జగన్ పునరుద్ఘాటించారు. మత్స్యకారులను ఎస్టిలలో, కళింగ కోమట్లను బిసిల్లో చేరుస్తానని హామి ఇచ్చారు.

ప్రజలలో మమేకమై..

ప్రజలలో మమేకమై..

ఇచ్ఛాపురం రోడ్‌షోలో జగన్ మాట్లాడుతూ.. కండ్ర కులస్తులను ఎస్సిలలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటానని జగన్ చెప్పారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Friday conducted road show at Ichhapuram in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X