2017 రౌండప్: పీకే వల్ల ఉపయోగం లేదా? జగన్ కీలక నిర్ణయాల వెనుక, అదీ ఆయన సూచనేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. నవరత్నాలు, మద్యపాన నిషేధం వంటివి ప్రశాంత్ సూచనలేనని చెబుతున్నారు. అయితే, ఆయన వ్యూహాలు నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రం పని చేయలేకపోయాయి.

జగన్ వెనుక ప్రశాంత్ కిషోర్

జగన్ వెనుక ప్రశాంత్ కిషోర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తానికి ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడని తొలుత వార్తలు వచ్చినప్పుడు దానిని తొలుత ఖండించారు. ఆయనకు ఎంత ఇస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఆ తర్వాత స్వయంగా జగన్ పార్టీ వేదికపై ఆయనను పరిచయం చేశారు.

2017 రౌండప్: పవన్‌కు అదే ప్లస్, జనసేనానితో జగన్ కార్నర్, బీజేపీ-టీడీపీ ఫైట్, 2019 ఆయుధం అదే!

  YS Jagan Confusing About Political Strategist Prashant Kishor - Oneindia Telugu
  ప్రశాంత్ కిషోర్‌కు ప్రాధాన్యతపై వైసీపీలో అసంతృప్తి

  ప్రశాంత్ కిషోర్‌కు ప్రాధాన్యతపై వైసీపీలో అసంతృప్తి

  ప్రారంభంలో వైసీపీలో ప్రశాంత్ కిషోర్ హవా బాగా కనిపించింది. స్వయంగా జగన్ కూడా నేతలకు ఆయన గురించి చెబుతూ.. ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని సూచించినట్లుగా ప్రచారం సాగింది. ప్రశాంత్ కిషోర్‌కు జగన్ అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై వైసీపీలో కూడా అసంతృప్తులు వ్యక్తమైనట్లుగా వార్తలు వచ్చాయి.

  రాజకీయాల్లో చిరంజీవితో టఫ్ సిచ్యుయేషన్, నేను బాధ్యత తీసుకున్నా: అల్లు అరవింద్

  ప్రశాంత్ కిషోర్ వల్ల కాదని

  ప్రశాంత్ కిషోర్ వల్ల కాదని

  ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమితో ఆయన వ్యూహాలు అంతగా పని చేయలేదని విమర్శలు చేసిన వారు ఉన్నారు. జగన్‌కు తెలియకే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని, కానీ ఆయన వల్లా ఏమీ కాదని టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. స్థానికంగా ఉండే అంశాలు ఆయనకు ఏం తెలుసునని వైసీపీలోనే అసంతృప్తి రాగాలు పలికిన వారు ఉన్నారని చెబుతారు.

  వైసీపీ కీలక నిర్ణయాల వెనుక పీకే

  వైసీపీ కీలక నిర్ణయాల వెనుక పీకే

  జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రస్తుతం చేస్తున్న పాదయాత్ర కూడా ప్రశాంత్ కిషోర్ సూచన అనే వాదనలు వినిపించాయి. ఇటీవల వైసీపీ కీలక నిర్ణయాల వెనుక ఆయన ఆలోచనలు ఉన్నాయి. అదే సమయంలో పార్టీ విషయంలో, స్థానిక అంశాలు తెలియకుండా ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారని కొందరు పార్టీ నేతలు కూడా గుసగుసలాడుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

  2019 టార్గెట్‌గా పీకే వ్యూహాలు

  2019 టార్గెట్‌గా పీకే వ్యూహాలు

  అంతకుముందు ప్రశాంత్ కిషోర్ పేరు బాగా వినిపించేది. జగన్ పాదయాత్ర అనంతరం ఆ పేరు ఎక్కువగా వినిపించడం లేదు. అయితే ప్రస్తుతం 2019 ఎన్నికల నాటికి వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రశాంత్.. అందుకు తగ్గ వ్యూహాలను రచించే పనిలో పడ్డారని భావిస్తున్నారు.

  ఇదీ పీకే సూచనేనా?

  ఇదీ పీకే సూచనేనా?

  మరోవైపు, చంద్రబాబు ప్రభుత్వం త్వరలో పడిపోతుందని జగన్ గతంలో పలుమార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన పదేపదే ముందస్తు ఎన్నికలు లేదా 2019లో ఎన్నికలు వస్తాయని, అప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. గతంలో బాబు ప్రభుత్వం కూలుతుందని, మరికొద్ది రోజుల్లో సీఎంను అవుతాననే విధంగా మాట్లాడేవారు. కానీ ఇటీవల ముందస్తు ఎన్నికలు రావొచ్చు లేదా 2019లో వస్తాయని చెబుతున్నారు. ఇది కూడా పీకే సూచన కావొచ్చని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress Party and party chief YS Jaganmohan Reddy's role in Andhra Praddesh politics after Prashant Kishor enter.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి