వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు 'తెలంగాణ' సాక్షి చిక్కులు, ఏపీ మీద విమర్శలపై వింత వాదన?

సాక్షి మీడియాలో వచ్చే కథనాలకు, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లంకె పెట్టడం విడ్డూరమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇది విచిత్ర వాదన అని కొందరు అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: సాక్షి మీడియాలో వచ్చే కథనాలకు, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లంకె పెట్టడం విడ్డూరమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇది విచిత్ర వాదన అని కొందరు అంటున్నారు.

మోడీకి 'ప్రత్యేక' షాకిచ్చేనా: కేజ్రీవాల్‌తో పవన్ కళ్యాణ్ కలుస్తారామోడీకి 'ప్రత్యేక' షాకిచ్చేనా: కేజ్రీవాల్‌తో పవన్ కళ్యాణ్ కలుస్తారా

పచ్చ మీడియా అంటూ విమర్శల మాటేమిటి?

పచ్చ మీడియా అంటూ విమర్శల మాటేమిటి?

సాక్షి మీడియా వైసిపి అధినేత జగన్‌కు చెందినది. టిడిపి అనుకూల పత్రికల్లో వచ్చినప్పుడు అదే వైసిపి నేతలు పచ్చ మీడియా అంటూ విమర్శలు చేస్తున్నారని, కానీ జగన్ సొంత పత్రికలో వచ్చే వాటిని మాత్రం లంకె పెట్టవద్దని చెప్పడం విడ్డూరమని అంటున్నారు.

వ్యక్తులకు ముడిపెట్టవద్దని

వ్యక్తులకు ముడిపెట్టవద్దని

పోతిరెడ్డిపాడు జల వినియోగం గురించి అన్ని మీడియా సంస్థలు రాశాయని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు. సాక్షి పత్రిక కూడా అదే క్రమంలో రాసిందని చెప్పారు. సాక్షిలో కథనం వస్తే జగన్ వాదన ఎలా అవుతుందని అంబటి ప్రశ్నించారు. మీడియాలో వచ్చే కథనాలను వ్యక్తులకు ముడిపెట్టవద్దన్నారు.

అంబటి వింత వాదన

అంబటి వింత వాదన

అంబటి రాంబాబు మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉండే పత్రికలు, ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనను ప్రతిబింబించేలా వార్తలు రాయడంలో తప్పేముందని మాట్లాడారు.

భుజాలు తడుముకోవడమే

భుజాలు తడుముకోవడమే

సాక్షి పత్రికలో కథనం వస్తే జగన్ అభిప్రాయం ఎలా అవుతుందని అంబటి ప్రస్నించడం సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనని అంటున్నారు. అసలు సాక్షి ఉన్నదే వైసిపి కోసమని, నడుస్తున్నదే జగన్ కోసమని చెబుతున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రాకు వ్యతిరేకంగా కథనం రాస్తే మాత్రం భుజాలు తడుముకొని జగన్‌కు సంబంధం లేదని అంటున్నారని విమర్శిస్తున్నారు.

English summary
YSR Congress Party self goal with Sakshi media story on pothireddypadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X