YSR Jayanthi: ప్రతి పేదింటి పెద్ద కొడుకు వైయస్ఆర్.. ఒక మనిషిని మహానేత చేసిన తరుణం
YSR Jayanthi: ఒకే ఒక వ్యక్తి, పరిపాలన చేసింది కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం మాత్రమే. తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే ఇద్దరే ఇద్దరు గుర్తుకువస్తారు. పేదవాడి కడుపు నిండాలని ఒకరు. పేదవాడు పదికాలల పాటు ఆరోగ్యంగా జీవనం సాగించాలని మరొకరు. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ ఒకరు, తెలుగు వాడి సత్తా అంటూ మరొకరు. మూడక్షరాల పేరు, మూడు తరాల తర్వాత కూడా చెప్పుకునే చిరస్మరనీయమైంది. పేరుకు ఎంత పెద్ద డాక్టరైనా, తిరుగులేని సీఎం అయినా... పేదవారికి మాత్రం తమ ఇంటి బిడ్డే. ప్రతి ఇంటికి వైఎస్ఆరే.
డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. ఈ ఒక్క పేరు దేశ రాజకీయాల్లో తెలుగుతనం అంటే ఏంటో చూపించింది. కొందరికి మాత్రమే అందే కార్పొరేట్ వైద్యాన్ని.. అందరికి అందించింది. పట్టుమని పదోతరగతి దాటి చదవలేని వారికి డిగ్రీ పట్టాలందించింది. వ్యవసాయం దండుగా అన్న వారిని ఢీ కొట్టి వ్యవసాయాన్ని పండుగ చేసింది. జలయజ్ఞంతో జవసత్వాలు అందించింది. పేదవాడికి రూ.2కే కిలో బియ్యంతో కడుపు నింపింది. కుయ్.. కుయ్.... కుయ్... అంటూ పరుగులు పెట్టె అంబులెన్స్ ను మన చెంతకు తెచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్ని వైఎస్ఆర్ ను మనిషి నుంచి మహానేతను చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత సీఎం డా.వైఎయస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వన్ ఇండియా స్పెషల్ స్టోరి.

అది 1949 జూలై 8. కడప జిల్లా జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు పుట్టిన మగబిడ్డ. వారు కూడా ఊహించి ఉండరు, ఈ బిడ్డ ప్రతి ఇంటికి పెద్దకొడుకు అవుతాడని, కలలో కూడా కలగని ఉండరు.. కట్టె కాలే వరకు కర్షకుల కోసం పరితపిస్తాడని, ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి.. ప్రేమకు ప్రతిరూపంలా మారతాడని. కన్నెర్ర చెస్తే కడప రాజకీయం గడగడ వణికాల్సిందిపోయి.. కడప గడపలో కరుణ చూపించాడు. రాష్ట్రానికి నవ్వుల వరాన్ని అందించాడు. పెద్దాయన అనే పేరు వారసత్వంగా వస్తుంది అందరికి. కానీ.. కొందరికి మాత్రం పెద్దాయన అనే పేరు ప్రజల గుండె చప్పుడు నుంచి వస్తుంది.
1978 ఎన్నికలు.. తొలిసారి ఘనవిజయం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఊహించి ఉండదు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టి.. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలను ఎదిరించి.. ముఖ్యమంత్రి పీఠాన్ని తన కాళ్ల వద్దకు తెచ్చుకుని.. ప్రజారంజక పాలనను అందిస్తాడని. నాలుగుసార్లు ఎంపీగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, పీసీసీ చీఫ్‌గా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా.. ఈ ప్రయాణం ప్రతి అడుగులో తాను ఎదుగుతూ.. తనని నమ్ముకున్న వాళ్లను తనతో పాటే ఎదిగేలా చేస్తే.. రాష్ట్ర రాజకీయాల్లోకి యువ రక్తాన్ని ఎక్కించి పొలిటికల్ హిస్టరీనే ఛేంజ్ చేసిన గేమ్ ఛేంజర్ వైయస్ఆర్.
ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైఎస్ఆర్ స్నేహం అనిర్వచనీయం. ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వారే. వైఎస్ఆర్ స్నేహం చేస్తే ఎలా ఉంటుందో, రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో, బాగా తెలిసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. టీడీపీ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణం... 2003లో మండువేసవిలో సుమారు 1,467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వైయస్.. కాంగ్రెస్ పార్టీ తన జీవితంలో ఎన్నడూ ఊహించని ఘన విజయాన్ని అందుకుంది. సీఎం అభ్యర్థి ఎవరైనా సరే.. నేను ఇస్తున్న మాట ప్రకారం వారు సంతకాలు పెడతారు అనే ధైర్యం.. సోనియా గాంధీని సైతం షాక్ కు గురి చేసిందంటే వైఎస్ హవా.. కాంగ్రెస్ లో ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకంతో రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైంది. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పరిపాలనలో చెరగని ముద్ర వేశారు.
ఇక 2009 ఎన్నికలు.. ఎదురుగా మహాకూటమి. కొత్త పార్టీతో మెగా ఎంట్రీ. సీనియర్ ఎన్టీఆర్ లాంటి సినీ గ్లామర్ ను ఆదరించిన తెలుగు ప్రజలు.. మరోసారి సినిమా వారికి అవకాశం ఇస్తారా.. లేదా మహా కూటమికి మద్దతుగా నిలుస్తారా అనే ఉత్కంఠ. కానీ వైఎస్ఆర్ ఏమాత్రం టెన్షన్ పడలేదు. ఒకవైపు తన రాజకీయ వారసత్వాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తూనే.. హోరాహోరీ ప్రచారానికి తెరలేపిన జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి సినీ గ్లామర్ ను.. చంద్రబాబు, కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండులను చూసి ఏ మాత్రం కూడా బెదరలేదు. తన చిరునవ్వుతో రాజకీయ ప్రత్యర్థుల పతనాన్ని శాసించారు. తిరిగి రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు జగన్ కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ ఆ రోజు వైఎస్ఆర్ కు లేదు.. కానీ ఆయన టార్గెట్ చేస్తే మాస్ అయినా క్లాస్ అయినా. పార్టీ కార్యకర్త అయినా న్యూట్రల్ ఓటర్ అయినా వైఎస్ఆర్ మైండ్ గేమ్ లో మద్దతు తెలపాల్సిందే. అయితే వైఎస్ఆర్ నేటిని మనతోనే ఉండి ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదని తెలుగు రాష్ట్రాల్లో సీఎంల దగ్గర నుంచి ప్రతి పేద గడప వరకు కూడా అనుకోని రోజు లేదు అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఆయన అకాల మరణం.. ఎవరు జీర్ణించుకోలేని ఒక సత్యం.
మనిషి లేకపోయినా ఆయన మాటుంది. నమస్తే అక్కా, నమస్తే చెల్లి, నమస్తే తాత, నమస్తే బాపు, నమస్తే.. నమస్తే.. నమస్తే... అనే ఈ ఆత్మీయ పలకరింపు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్ అమరుడు, వైఎస్ఆర్ అజేయుడు. ఆయన జయంతి వేళ ఆయనకు నివాళులు అర్పిస్తుంది తెలుగు నేల. వైఎస్ఆర్ ను మీరు ఎలా అభివర్ణిస్తారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications