వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ: వైయస్ విధేయులు పరాజయం పాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో సీమాంద్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ వాటిలో మరో సాధారణ లక్షణం కూడా కనిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయనకు విధేయులుగా ఉన్నవారు ఓటమి పాలు కావడం గమనించవచ్చు.

అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ వైయస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయులుగా వ్యవహరించినవారు ఓటమి పాలయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు, ఆయనపై ప్రజల్లో ఉన్న ఆదరణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సీమాంధ్రలో గట్టెక్కుస్తుందని భావించారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి.

YSR loyalists defeated in assembly election

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య ఓట్ల శాతంలో తేడా అతి తక్కువగా ఉన్నప్పటికీ విజయం మాత్రం టిడిపినే వరించింది. రెండు పార్టీలు హోరాహోరీ పోరాటం చేశాయి. కాంగ్రెసు ఓట్లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లాక్కున్నట్లు అర్థమవుతోంది. ఓటమి పాలైన వైయస్ విధేయుల్లో సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవారు ఎక్కువ కాగా, తెలంగాణలో కాంగ్రెసు అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు.

సీమాంధ్రలో ఓటమి పాలైన వైయస్ విధేయులు

బొత్స సత్యనారాయణ - కాంగ్రెసు (తొలుత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విధేయుడు)
చంద్రశేఖర రెడ్డి - కాకినాడ అర్బన్
సుభాష్ చంద్రబోస్ - వైకాపా
జోగి రమేష్ - వైకాపా
అంబటి రాంబాబు - వైకాపా
బాలినేని శ్రీనివాస రెడ్డి - వైకాపా
జూపూడి ప్రభాకర రావు - వైకాపా
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి - వైకాపా
మేకపాటి చంద్రశేఖర రెడ్డి - వైకాపా
శిల్పా మోహన్ రెడ్డి - వైకాపా
గుర్నాథ్ రెడ్డి - వైకాపా
భూమన కరుణాకర్ రెడ్డి
గల్లా అరుణ కుమారి - టిడిపి
ధర్మాన ప్రసాద రావు - వైకాపా

తెలంగాణలో ఓటమి పాలైన వైయస్ విధేయులు

జగ్గారెడ్డి - కాంగ్రెసు
ముఖేష్ గౌడ్ - కాంగ్రెసు
దానం నాగేందర్ - కాంగ్రెసు
సుధీర్ రెడ్డి - కాంగ్రెసు
పొన్నాల లక్ష్మయ్య - కాంగ్రెసు
దుగ్యాల శ్రీనివాస రావు - కాంగ్రెసు

English summary
YS Rajasekhar Reddy loyalists from YSR Congress in Seemandhra, Congress in Telangana defeated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X