వైసీపీకి ఎన్నటికీ ఓటమి ఉండదు - కారణం ఇదే : సజ్జల..!!
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైసీపీని ఓడించలేరని సజ్జల ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
ఎన్నికల్లో అడ్డాదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు. ఓటర్లను తొలిగిస్తున్నారని..దొంగ ఓటర్లను చేర్చుతున్నారనే టీడీపీ ఆరోపణలను సజ్జల ఖండించారు. గతంలో ఓటర్లను తొలిగించేందుకు చంద్రబాబు టెక్నాలజీ వినియోగించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వైయస్ఆర్ సీపీ ఓ రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరని..వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదని సజ్జల చెప్పుకొచ్చారు.
నిజమైన లీడర్ జగన్
వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సజ్జల పార్టీ జెండా ఆవిష్కరించారు. 12 ఏళ్లుగా సీఎం జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారని సజ్జల పేర్కొన్నారు. జగన్ నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడని చెప్పారు.
ప్రజల ఆశీస్సులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చారని వివరించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం సాగిందని సజ్జల చెప్పుకొచ్చారు.
వైసీపీ చిరస్థాయిగా నిలిచిపోతుంది
ఒక నాయకుడు ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలనేది జగన్ 15 ఏళ్ల కాలంగా జగన్ నరూపించారని సజ్జల పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను తన అజెండాగా మార్చుకున్న నాయకుడిని ప్రజలు ఎంతగా ఆదరిస్తారో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి విషయంలో స్పష్టమైందన్నారు. ఆదర్శ పరిపాలన ఎలా ఉండాలో వైయస్ఆర్ దిశానిర్దేశం చేశారని కొనియాడారు.
తండ్రి బాటలోజగన్ అడుగులు వేసి ప్రజల్లో మమేకమైన నాయకుడని పేర్కొన్నారు. వైసీపీ 12 ఏళ్ల ప్రస్థానం..అంతకు ముందు మూడేళ్లలో జగన్ ఒక నాయకుడిగా సమర్ధవంతంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. ఒక ప్రజా నాయకుడి నాయకత్వంలో ఒక పార్టీ ఆవిర్భవిస్తే ఎలా ఉంటుందో జగన్ చూపించారన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం సాగిందని సజ్జల చెప్పారు.

వైసీపీని ఎవరూ ఓడించలేరు
దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో సీఎం జగన్ ఉద్యోగాల భర్తీ చేశారని వివరించారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారన్నారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పిన సజ్జల ప్రజాస్వామ్యంలో వైయస్ఆర్ సీపీ ఓ రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు.
ఎవరు కలిసి వచ్చినా.. ఎంత మంది కలిసి కుట్రలు చేసినా వైసీపీని ఏం చేయలేరన్నారు. ప్రజల మధ్య నుంచి వైసీపీ నిలిచిందని చెప్పారు. ప్రజా మద్దతు వైసీపీ వైపే ఉందని..ఎప్పటికీ ఎవరూ వైసీపీని ఓడించలేరని సజ్జల స్పష్టం చేసారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications