నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఫిక్స్

Anil Kumar Yadav: పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసన సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టే. ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అయిదో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం ఖరారు కావడం, తనను గుంటూరు లోక్‌సభకు బదలాయించడం వంటి కారణాల వల్ల లావు రాజీనామా చేయాల్సి వచ్చింది. కృష్ణదేవరాయలు స్థానంలో అనిల్ కుమార్ యాదవ్‌ పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారని తెలుస్తోంది.

YSRCP 5th list: Vemireddy Prashanthi Reddy to contest in Nellore City, instead Anil Kumar Yadav

అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేటకు పంపించడం వల్ల ఖాళీ అయిన నెల్లూరు సిటీ స్థానానికి మహిళా అభ్యర్థిని బరిలో దింపనున్నారు వైఎస్ జగన్. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇస్తారని సమాచారం.

మొదటి నుంచీ ఈ నియోజకవర్గంపై రెడ్డి సామాజిక వర్గ నాయకులదే ఆధిపత్యం. 1972 నుంచీ రెడ్డి సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తోన్నారు. ఈ సంప్రదాయానికి వైఎస్ జగన్ చెక్ పెట్టారు. తొలిసారిగా 2014లో బీసీ నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. రెండుసార్లు గెలిపించుకోగలిగారు.

YSRCP 5th list: Vemireddy Prashanthi Reddy to contest in Nellore City, instead Anil Kumar Yadav

ఇక మళ్లీ నెల్లూరు సిటీ నుంచి రెడ్డి సామాజిక వర్గీయులకే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారాయన. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. ఆమె పేరే ఖరారవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. జిల్లాలో వేమిరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉండటం, ఆర్థిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశాంతిరెడ్డికే టికెట ఖరారు చేస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+