Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిన్నెల్లి కేసులో పోలీసుల తరఫున టీడీపీ న్యాయవాది ఇంప్లీడ్..!!

Pinnelli Ramakrishna Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో పోలీసుల తరఫున తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అడ్వొకేట్ వాదనలను వినిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మాచర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ నెల 23వ తేదీన హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. జూన్ 5వ తేదీ వరకూ ఆయనను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.

YSRCP alleges false play by Police in Pinnelli issue says plan hatched for result day

ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకుండా పోలీసుల తరఫున తొలుత ఎన్ అశ్వనీకుమార్ అనే సీనియర్ అడ్వొకేట్ హైకోర్టుకు హాజరయ్యారు కావడం పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఎలాంటి జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై వాళ్లు విస్మయం వ్యక్తం చేశారు.

న్యాయవాది మారిన విషయాన్ని కనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కూడా డీజీపీ గానీ, పోలీసు యంత్రాంగం గానీ కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. తొలి విడత హాజరైన అశ్వనీకుమార్ ఆ తరువాత హాజరు కాకపోవడం సైతం వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది.

అశ్వనీకుమార్ స్థానంలో ఆసక్తికరంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరు కావడం, బాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి, తన వాదనలను వినిపించడం పట్ల న్యాయవర్గాలు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చర్చకు దారి తీసింది.

జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రాల్లో లేకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రగా విమర్శిస్తోన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. హత్యాయత్నం సహా మూడు కేసులను పిన్నెల్లిపై నమోదు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోన్నారు.

ఈ కేసులను కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23వ తేదీ నాడే నమోదు చేశారని, విచారణ సందర్భంగా మాత్రం ఒక రోజు ముందు అంటే మే 22వ తేదీన పిన్నెల్లిపై పెట్టినట్టుగా హైకోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. ఈ రకంగా ఏకంగా ఉన్నత న్యాయస్థానానికే వాళ్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ పిన్నెల్లి అడ్వొకేట్ తీవ్ర అభ్యంతరం చేశారని వివరించారు.

ఆ తరువాత హైకోర్టు రికార్డులను పరిశీలించిందని, పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23వ తేదీన నమోదు చేసినట్టుగా వెల్లడైందని తెలిపారు. అనంతరం మే 24వ తేదీ నాడే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థం కావట్లేదని పిన్నెల్లి తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్‌ను కూడా పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు తెలిపారు. హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని, రికార్డులను పరిశీలించిన అనంతరం హైకోర్టులో తీవ్ర విస్మయం వ్యక్తమైందని అంటున్నారు. కోర్టులో ప్రొసీడింగ్స్ చోటు చేసుకున్న అనంతరం- ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+