విశాఖ ఎవరి ఖాతాలో, డిసైడింగ్ ఫ్యాక్టర్ - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ విశాఖ(Visakha) రాజకీయ కేంద్రంగా మారుతోంది. మూడు రాజధానుల నినాదంతో విశాఖకు ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగింది. సీఎం జగన్(CM Jagan) దసరా నుంచి విశాఖలో పాలనకు సిద్దం అవుతున్నారు. అటు కేంద్రం(Central) తీసుకుంటున్న నిర్ణయాలతో విశాఖలో మైలేజ్ దక్కించుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ - జనసేన (TDP Janasena)పొత్తుతో విశాఖ సమీకరణాలు కలిసి వస్తాయని ఆ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి.
విశాఖ కేంద్రంగా
ఏపీలో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు ఏపీలోని జిల్లాల వారీగా పార్టీలు ఎన్నికల్లో తమ బలం చాటుకొనేందుకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. మూడు రాజధానుల(Three Capital row) నిర్ణయం అమలుకు న్యాయపరమైన చిక్కులు ఉండటంతో విశాఖ(Visakha) నుంచి పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేసారు. వారంలో రెండు రోజులు విశాఖ నుంచే పాలన జరిగేలా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయయి. ఇందుకు అనుగుణంగా సీఎం(CM Jagan) తో సహా మంత్రుల క్యాంపు కార్యాలయాలు ముస్తాబు అవుతున్నాయి. దీని ద్వారా విశాఖ పరిపాలనా రాజధాని చేయటంతో పాటుగా అక్కడ మౌలిక సదుపాయల ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రాజకీయంగానూ ప్రత్యర్ధి పార్టీల పైన పైచేయి సాధించాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

మారుతున్న రాజకీయం
ఇటు టీడీపీ, జనసేన పొత్తుతో గోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి విశాఖ(Visakha)లోనూ స్థానిక - సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని ఆ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిన పవన్ ఈ సారి విశాఖ కేంద్రంగా తన కార్యాచరణ అమలు చేస్తున్నారు. అమరావతి(amaravati)ని రాజధాని కాదనటంతో అక్కడ తమకు కలిసి వస్తుందని భావిస్తున్న ఈ రెండు పార్టీల నేతలు..విశాఖలో రాజధాని వద్దని చెబుతున్న సమయంలో ఏ మేర ప్రభావం చూపిస్తుందనే ఆందోళన కూడా వెంటాడుతోంది. అయితే, రాజధాని(Capital) కంటే ప్రభుత్వం వైఫల్యాలే..స్థానికంగా చోటు చేసుకున్న పరిణామాలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ(BJP) నేతలు విశాఖ లోక్ సభ కేంద్రంగా పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.

మైలేజ్ దక్కేదెవరికి
విశాఖకు తాజాగా నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీగా జాబితాలో చేర్చింది. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్(Steel Pant) ప్రయివేటీకరణ నిర్ణయం నిలిచిపోయిందని బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీకి జీవీఎల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో గతంలో విశాఖ ఎంపీగా పని చేసిన బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి(Purandeswari) సైతం విశాఖ పైన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వైసీపీ వర్సస్ టీడీపీ, జనసేన కేంద్రంగా సాగుతున్న పొలిటికల్ ఫైట్ లో ఇప్పుడు విశాఖ(Visakha) కేంద్రంగా నిలుస్తోంది. సీఎం జగన్ విశాఖలో పాలన..రానున్న ఆరు నెలల కాలంలో విశాఖ అభివృద్ధిలో మార్పులు పూర్తిగా తమకు అనుకూలిస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో..విశాఖలో మైలేజ్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications