Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. గెలుపు పైన కూటమి, వైసీపీ ధీమాగా ఉన్నాయి. రేపు (గురువారం)తో నామినేషన్ల గడువు ముగియనుంది. ప్రధాన పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. జగన్ బస్సు యాత్ర ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 26న జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమవుతున్నారు. టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రకటనకు సిద్దం అవుతోంది. వీటి ప్రకటన తో ఏపీలో ఎన్నికల ఫలితాలపై స్పష్టత వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

మేనిఫెస్టో కసరత్తు
ఏపీ ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. ఎన్నికల హామీల ప్రకటనకు ప్రధాన పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా భావించే మేనిఫెస్టోల ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. సుదీర్ఘ కసరత్తు తరువాత సీఎం జగన్ ఈ నెల 26న తన మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తంగా నిర్ణయించారు. రేపు పులివెందులలో నామినేషన్ తరువాత పార్టీ నేతలతో మరోసారి మేనిఫెస్టో పైన జగన్ సమావేశం కానున్నారు. 26న తాడేపల్లిలో జగన్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసామని ప్రతీ సభలో జగన్ చెబుతూ వచ్చారు. ఈ సారి మేనిఫెస్టోలో ఏం ప్రకటించబోతున్నారనేది కీలకంగా మారుతోంది.

YSRCP and TDP Alliance all set for Release Election manifestos become game changer in keen contest

జగన్ హామీలు ఏంటి
జగన్ తన మేనిఫెస్టోలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే..కొత్త హామీలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ మేనిఫెస్టో గురించి ప్రచారం చేస్తోంది. డ్వాక్రా మహిళలకు రూ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్లకు రూ 10 వేల గౌరవ వేతనం, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, రూ 4 వేల పెన్షన్ అమలు పైన హామీలు ఇచ్చారు. మూడు పార్టీల కూటమిలో భాగంగా టీడీపీ 7 హామీలు, జనసేన మూడు హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో ప్రకటించిన మేనిఫెస్టోకు అనుగుణంగా రాష్ట్రంలోని కొన్ని హామీలు జోడించే అవకాశం కనిపిస్తోంది. అయితే, జగన్ మేనిఫెస్టో తరువాత అవసరమైన హామీలతో కూటమి మేనిఫెస్టో ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది.

ఫలితాల పై క్లారిటీ
జగన్ తన మేనిఫెస్టోలో అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా పైన నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, రైతు రుణమాఫీ అమలు చేయాలని పార్టీ నేతలు జగన్ ను కోరుతున్నారు. జగన్ తన మనసులో మాట మాత్రం బటయ పెట్టలేదు. జగన్ రైతు రుణమాఫీ అమలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందీ..జగన్ చేయకుండా కూటమి ప్రకటన చేస్తే ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు రాజకీయం గా చర్చకు కారణమవుతోంది. చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ అమలు చేయరనేది జగన్ ప్రతీ సభలోనూ ప్రధానంగా వివరిస్తున్నారు. అదే సమయంలోరైతులు, మహిళలకు సంబంధించి జగన్ కీలక హామీలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో, వైసీపీ..కూటమి మేనిఫెస్టోలు ప్రకటన తరువాత ఎన్నికల పోలింగ్..కౌంటింగ్ కు ముందే గెలుపు అంచనాలపైన స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+