ఆసక్తికరంగా విజయవాడ రాజకీయం-వైసీపీ, టీడీపీ తాజా పరిస్ధితి ఇదే-కొత్త అభ్యర్ధులు ఖాయమే!
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చైతన్యం కలిగిన జిల్లా అయిన కృష్ణాజిల్లాను వైసీపీ సర్కార్ తాజాగా జిల్లాల విభజనలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలుగా విభజించింది. అయితే ఇందులో ఎన్టీఆర్ జిల్లాగా మారిన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి రాజకీయం కాక రేపుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీకి కూడా ఈసారి రాజకీయం అంతుబట్టడం లేదు. అమరావతితో మొదలైన రాజకీయం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతూ కొత్త అభ్యర్ధుల్ని ఎంచుకునే దాకా పార్టీల్ని తీసుకెళుతోంది. దీంతో త్వరలో ఊహించని మార్పులు చోటు చేసుకునేలా ఉన్నాయి.

విజయవాడ రాజకీయం
కమ్మ సామాజిక వర్గ కేంద్రంగా సాగే విజయవాడ రాజకీయాల్లో ఈ మధ్య పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే అవి సామాజిక వర్గాల పరంగా కాకుండా పార్టీల పరంగానే కావడం విశేషం. ఎందుకంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అండ లేకుండా ఏ పార్టీ కూడా రాజకీయాలు చేసే అవకాశం లేదు. దీంతో ఈ సామాజికవర్గం, పెద్దలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇందులో కీలకపాత్ర పోషిస్తూనే ఉన్నారు.
అంతే కాదు గత ఎన్నికల్లో రాష్టమంతా వైసీపీ గాలి విచినా ఇక్కడ మాత్రం ఎంపీగా కేశినేని నాని, విజయవాడ తూర్పు సీటు నుంచి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయం మరిన్ని మార్పులకు లోనైంది.

వైసీపీకి ఎదురుగాలి?
మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీకి విజయవాడలో మాత్రం పరిస్దితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా స్ధానిక ఎన్నికల్ని ఏకపక్షంగా గెల్చుకున్న వైసీపీ.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల విషయంలో మాత్రం పునరాలోచించాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి.
తాజా కేబినెట్ విస్తరణలో జగన్ కమ్మ సామాజిక వర్గ మంత్రి కొడాలి నానిని తప్పించడం, అదే సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వకపోవడం వంటి కారణాలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. అదే సమయంలో అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారనే ఆగ్రహం జనాల్లో కనిపిస్తోంది. ఇవన్నీ వైసీపీ తరఫున మరోసారి పోటీ చేసే అభ్యర్ధుల్ని ఆలోచనలో పడేస్తున్నాయి.

కుమ్ములాటలతో టీడీపీ?
విజయవాడ పార్లమెంటు స్ధానంతో పాటు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోనూ తాజాగా పరిస్దితులు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఆ సామాజికవర్గం గతంలో తమకు అండగా ఉన్న టీడీపీకి మరోసారి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
దీంతో ఉత్సాహంగా ఉన్న టీడీపీలో అంతర్గతంగా కుమ్ములాటలు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని ఇవే కుమ్ములాటలతో వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్ధానంలో టీడీపీ అధిష్టానం కేశినేని సోదరుడు చిన్నితో పాటు మరికొందరు పేర్లను తెరపైకి తెస్తోంది.

వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్ధులపై ఆసక్తి!
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సినీ నిర్మాత పొట్లూరి వీర ప్రసాద్ మారుతున్న పరిస్దితుల్లో మరోసారి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. విజయవాడలో వైసీపీ కార్యక్రమాల్లో సైతం ఆయన కనిపించడం లేదు. దీంతో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ పేరును అధిష్టానం పరిశీలిస్తోంది.
గతంలో కాంగ్రెస్ తరఫున 2014లో ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన అవినాష్ ప్రస్తుతం విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే చాలనుకుంటున్న ఆయన్ను తప్పనిసరైతే ఎంపీగా పోటీ చేయేందుకు వైసీపీ సిద్దమవుతోంది.
అదే సమయంలో టీడీపీ తరఫున కేశినేని నాని పోటీ నుంచి విరమించుకోవడంతో ఆయన సోదరుడు చిన్ని పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయనగ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు. ఆయనతో పాటు పోటీలో అశ్వనీదత్, నెట్టెం రఘురాం, సినీనటుడు రాజేంద్రప్రసాద్ వంటి వారు ఉన్నారు. వీరిలో టీడీపీ టికెట్ ఎవరికైనా లభించే అవకాశముంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications