అమరావతి వర్సెస్ త్రీ క్యాపిటల్స్- వైసీపీ, టీడీపీ మాటల తూటాలు-ఎవరేమన్నారంటే ?
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయ పోరు కాస్తా ఇప్పుడు రాజధాని పోరుగా మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి స్ధానంలోకి వచ్చిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు రైతుల పాదయాత్రతో మరో మలుపు తీసుకుంది. రైతులు పాదయాత్ర పూర్తి చేస్తే మూడు రాజధానులకు మద్దతు లేదనే వాదన మొదలువుతందనే భయంతో వైసీపీ దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. స్ధానిక మద్దతుతో, టీడీపీ అండతో ఈ యాత్ర ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్దం కొనసాగుతోంది.

అమరావతి వర్సెస్ మూడు రాజధానులు
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు ముదిరింది. ఇన్నాళ్లూ అమరావతి రాజధానిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరుపక్షాలు నడుచుకుంటాయని అంతా భావిస్తుండగా.. అమరావతి రైతుల పాదయాత్రతో ఇది కాస్తా వీధి పోరాటంగా మారిపోయింది. దీంతో ఈ పాదయాత్రను అడ్డుకోవడంలో విఫలమైతే మూడు రాజధానులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్న వైసీపీ తమ పార్టీ నేతల సాయంతో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలుచేస్తోంది. ఇందుకోసం విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడంతో పాటు ఈనెల 15న వికేంద్రీకరణ గర్జనకు సన్నాహాలు చేస్తోంది. ఇదంతా గమనిస్తున్న అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. దీంతో ఇవాళ తణుకులో వైసీపీ శ్రేణులు దీన్నిదాదాపు అడ్డుకున్నంత పనిచేశాయి.

వైసీపీ విమర్శల హోరు
అమరావతి పాదయాత్రపై వైసీపీ మంత్రులు మాటల దాడి పెంచారు. రాజధాని తమ బతుకు పోరాటమని, 130 ఏళ్ళ తమ ఆవేదన, ఘోష అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇన్నేళ్ళకు రాజధాని వస్తుంటే.. అడ్డుకోవడం ధర్మమా బాబూ అని ప్రశ్నించారు. మా వేళ్ళతో మా కళ్ళని పొడుస్తామంటే సహిస్తామా అని నిలదీశారు
రాష్ట్ర సంపదనంతా అమరావతిలోనే పెట్టాలనడం ధర్మమా అన్నారు. అమరావతి సెంటిమెంట్ లేదు కాబట్టే.. లోకేష్ ఓడిపోయాడన్నారు. దమ్ముంటే రాజధానిగా విశాఖ వద్దు అని చంద్రబాబు చెప్పాలన్నారు.
రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ పాదయాత్ర చేస్తోందని మరో మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలే వారి లక్ష్యమన్నారు. అమరావతిలో రాజధానికి ప్రజల మద్దతు లేదన్నారు. ధైర్యం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని రాజా సవాల్ విసిరారు. లేదా చంద్రబాబు, అచ్చెన్నాయుడైనా రాజీనామా చేయాలన్నారు. అటు మత్సశాఖ మంత్రి అప్పలరాజు తమ తలలు తెగినా సరే.. విశాఖను రాజధానిగా చేసుకుంటామన్నారు. తమ ప్రాంత అభివృద్ధికి ఎవరు అడ్డం వచ్చినా సహించబోమన్నారు. తొక్కుకుంటూ పోతామన్నారు. 15న జరిగే విశాఖ గర్జన.. ప్రత్యర్థుల గుండెల్లో గుణపంలాంటిదని అప్పలరాజు తెలిపారు.
అమరావతి యాత్ర ఒక కృత్రిమ ఉద్యమమని, చంద్రబాబు మా ప్రాంతంలో ఎలా అడుగు పెడతాడో చూస్తామన్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు చారిత్రక అవసరం అని వీళ్ళే అంటారని, మళ్ళీ వీళ్ళే దండలు వేస్తారన్నారు.

టీడీపీ కౌంటర్ అటాక్..
వైసీపీ మంత్రుల విమర్శలపై టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తోంది. మూడు రాజధానుల కుట్రతో ప్రాంతీయ చిచ్చు పెడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చిన సంగతి జగన్ రెడ్డి మరిచారా అని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే జగన్ రెడ్డికి అర్ధం తెలుసా అని నిలదీశారు. రాజుమారినప్పుడల్లా రాజధాని మార్చడం సాధ్యంకాదని న్యాయస్థానం చెప్పినా, జగన్ రెడ్డి మూడు రాజధానులంటూ ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడానికే పాకులాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని విస్మరించి మరీ, జగన్ రెడ్డి మెప్పుకోసం తమ పదవులకోసం మంత్రులు అమరావతి రైతుల్ని అవమానిస్తున్నారన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ధర్మాన, తమ్మినేని, బొత్స, ఇతర మంత్రులు, వైసీపీ నేతల అభివృద్ధికాదని,, పదోతరగతి చదివిన ధర్మానకు శ్రీకృష్ణకమిటీ నివేదిక ఏం అర్థమవుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూనరవి కుమార్ ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లే చంద్రబాబు ఉత్తరాంధ్రను అన్నివిధాల అభివృద్ధిచేశారని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర మంత్రులమని చెప్పుకుంటున్నవారంతా, ఆప్రాంతంలో విజయసాయిరెడ్డి చేస్తున్న భూకబ్జాలతో పోటీపడలేక, ప్రభుత్వంలోఉండికూడా తమకేమీదక్కడంలేదన్న నిరాశానిస్పృహలతో, టీడీపీపై, చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారని కూనరవికుమర్ విమర్శించారు.
-
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
మోదీ ప్రతిపాదన పై జగన్ ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications