ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది రెండుసార్లే..!!
Markapuram Assembly round up: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు లోకసభ పరిధిలోని ఉండే జనరల్ నియోజకవర్గం మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. తెలుగుదేశం పార్టీ ఉనికి అంతంత మాత్రమే ఇక్కడ. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ- టీడీపీ మధ్య హోరాహోరి పోరు సాగే అవకాశం ఉంది.
మార్కాపురం, కొనకమిట్ల, పొదిలి, తర్లుపాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 1951లో నియోజకవర్గాల పునర్వ్వవస్థీకరణలో ఏర్పడింది. సంఖ్యాపరంగా గానీ, రాజకీయంగా గానీ రెడ్డి సామాజిక వర్గీయులదే పైచేయి. వారి తరువాత యాదవ, ముస్లిం, వైశ్య సామాజిక వర్గాలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఎస్సీ, తెలగ, కాపు, కమ్మ కులస్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటారు.

1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు రెడ్లే గెలిచారు. దీన్ని బట్టి- మార్కాపురం నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి ఎంత పట్టు ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా నజీర్ బేగ్ అనే ముస్లిం నాయకుడు విజయం సాధించారు.
టీడీపీ ఆవిర్భవించక ముందు ఆరు ఎన్నికలు జరగ్గా, కృషికార్ లోక్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ రెండుసార్లు చొప్పున గెలిచాయి. సీపీఐ ఒకసారి విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా పూల సుబ్బయ్య పాగా వేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరునే పెట్టింది ప్రభుత్వం. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు.
టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిది ఎన్నికలు జరగాయి. టీడీపీ 1983, 2009 ఎన్నికల్లో మాత్రమే మార్కాపురాన్ని సొంతం చేసుకోగలిగింది. కాంగ్రెస్ నాలుగుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, వైఎస్ఆర్సీపీ రెండుసార్లు గెలిచాయి. 1983లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన వీవీ నారాయణరెడ్డి.. మంత్రిగా పని చేశారు. అత్యధికంగా కుందూరు పెద్ద కొండారెడ్డి నాలుగు సార్లు గెలిచారు.
2009లో టీడీపీ అభ్యర్ధి కందుల నారాయణరెడ్డి.. కాంగ్రెస్‌కు చెందిన కేపీ కొండారెడ్డిపై 9,054 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.. వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి జంకె వెంకటరెడ్డి చేతిలో 9,802 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డి .. కందులను 18,667 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఈ ఎన్నికల్లో కుందూరు నాగార్జునరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదు. ఆయనను గిద్దలూరుకు పంపించింది. గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబును మార్కాపురం ఇన్‌ఛార్జీగా నియమించింది వైసీపీ.
టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కందుల నాగార్జునరెడ్డికే టీడీపీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు 2019 ఎన్నికల్లో 70,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు మార్కాపురంలోనూ అదే స్థాయిలో విజయాన్ని ఆశిస్తోన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications