వైసీపీ తాజా జాబితా: ముగ్గురు ఎంపీలు, 27 నియోజకవర్గాల్లో అభ్యర్దుల ప్రకటన..!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. కొద్ది రోజులుగా ఇంఛార్జ్ ల మార్పు ప్రక్రియలో భాగంగా రెండో జాబితాను ప్రకటించారు. గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ అభ్యర్దులను ఎంపికి చేస్తున్నారు. తొలి జాబితాలో 11 మందిని ఖరారు చేసిన జగన్.. ఇప్పుడు రెండో జాబితాలో 22 నియోజకవర్గాలకు అభ్యర్దులను నిర్ణయించారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పు తప్పదని తెలుస్తోంది.

ముగ్గురు ఎంపీల ఖరారు
ముగ్గురు ఎంపీలను వైసీపీ ప్రకటించింది. అనంతపురం ఎంపీగా ప్రస్తుత పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణను ఖరారు చేసారు. హిందూపురం ఎంపీగా బీజేపీ మాజీ ఎంపీ శాంతమ్మకు కేటాయించారు. అరకు ఎంపీగా కే భాగ్యలక్ష్మి పేరు ప్రకటించారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ ను రాజమండ్రి సిటీ అభ్యర్దిగా ప్రకటించారు. రాజమండ్రి రూరల్ కు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణను ఖరారు చేసారు. పోలవరం నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్యే బాలరాజు సతీమణికి కేటాయించారు. గుంటూరు ఈస్ట్ - ఫాతిమా పేరు ఖరారు చేసారు. ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్ ను అభ్యర్దిగా ప్రకటించారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డికి కేటాయించారు. మచిలీ పట్నం - పేర్ని నాని కుమారుడు పేర్ని క్రిష్ణమూర్తిని ముఖ్యమంత్రి ఎంపిక చేసారు.

YSRCP Announces second list of Incharges change in 27 constitunecies, 3 Mp Candidates finalised

27 చోట్ల మార్పులు చేర్పులు
చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ - ప్రస్తుత మంత్రి ఉషా చరణ్ ను అభ్యర్దిగా ప్రకటించారు. రాజాం - డాక్టర్ తాలె రాజేష్, అనకాపల్లి -ఘలసాల భరత్ కుమార్, పాయకరావు పేట - కంబాల జోగులు, రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాశ్, పి గన్నవరం - విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం- వంగా గీత, జగ్గంపేట- తోట నర్సింహం, ప్రత్తిపాడు -వరుపుల సుబ్బారావు. కదిరి - మక్బూల్ అహ్మద్. ఎర్రగొండపాలెం - తాటిపర్తి చంద్రశేఖర్, కల్యాణ్ దుర్గం - తలారి రంగయ్య, అరకు - గొడ్డేటి మాధవి, పాడేరు - విశ్వేశ్వర రాజు, విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు, విజయవాడ వెస్ట్ - షేక్ ఆసీఫ్ పేరు ఖరారు చేసారు. దీని ద్వారా ముగ్గురు ఎంపీ అభ్యర్దులను ఖరారు చేయటంతో పాటుగా 27 నియోజకవర్గాల్లో అభ్యర్దుల్లో మార్పులు చేర్పులు పార్టీ ప్రకటించింది.

వారసులకు ఛాన్స్
ఈ జాబితాలో భూమన, చెవిరెడ్డి, పేర్నినాని, పిల్లి బోస్, ముస్తఫా వారసులకు సీట్లు కేటాయించారు. అయిదు నియోజకవర్గాల్లో ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఖరారు చేసారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీగా హామీ ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాధ్ ను ఎంపీగా పంపే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజా మార్పులతో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్దుల జాబితా ను మరో రెండు రోజుల్లో పూర్తి చేసే అవకాశంఉంది. దీని ద్వారా ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసారు. ఈ మార్పుల పైన నేతల స్పందన చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+