Realme NARZO 100x 5G లాంఛ్‌కి రెడీ.. ఎప్పుడంటే ???
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ "రియల్‌మీ" భారతీయ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. కాగా ఇండియాలో రియల్‌మీ ప్రస్థానం 2018లో ప్రారంభమవ్వగా.. అప్పటి నుంచి బడ్జెట్ నుంచి ఫ్లాగ్‌షిప్ వరకూ పలు సెగ్మెంట్లలో ఫోన్లను విడుదల చేస్తూ పలు బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తోంది. ఎక్కువగా యువతను టార్గెట్ చేసే ఈ బ్రాండ్.. తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. లేటెస్ట్ గా రియల్ మీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమ నార్జో సిరీస్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఈ మేరకు realme NARZO 100x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో జూలై 15 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది. పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, రోజువారీ వినియోగానికి సరిపోయే ప్రాసెసర్, IP65 రేటింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ డివైస్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

realme NARZO 100x 5G ఫీచర్స్..
బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8000mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని రియల్‌మీ పేర్కొంది. అంతేకాకుండా నాలుగేళ్ల సాధారణ వినియోగం తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం 80% కంటే ఎక్కువగా కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. భారీ బ్యాటరీకి తోడు 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్ అందిస్తుంది. కేవలం 33 నిమిషాల్లోనే బ్యాటరీని 50% వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండటంతో ఇతర డివైస్‌లను ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
పనితీరు..
MediaTek Dimensity 6300 5G ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. 6nm ప్రాసెస్ టెక్నాలజీపై రూపొందించిన ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరు, తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందించేలా రూపొందించబడింది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి అవసరాలను కూడా సమర్థంగా నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంటుందని భావిస్తున్నారు.
డిస్‌ప్లే..
ఈ మొబైల్ లో 6.72 అంగుళాల 120Hz Ultra Smooth Display అందించనున్నారు. కంటెంట్‌ను బట్టి డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌ను 120Hz, 90Hz, 60Hz, 50Hz, 48Hz, 45Hz స్థాయిల మధ్య ఆటోమేటిక్‌గా మార్చుకునే సదుపాయం ఉంటుంది. దీంతో ఒకవైపు స్మూత్ విజువల్ అనుభవం లభిస్తే.. మరోవైపు బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది.
కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP AI మెయిన్ కెమెరా ఇవ్వనున్నారు. అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లు కూడా ఉండనున్నాయి.
ఇతర ఫీచర్స్..
ఫోన్ మన్నికను పెంచేందుకు ArmorShell Structural Protectionను అందిస్తోంది. వీటితోపాటు రైన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా ఉండటంతో చేతులు తడిగా ఉన్నా లేదా వర్షంలోనూ టచ్ స్పందన మెరుగ్గా పనిచేసేలా రూపొందించారు.
ధర & లాంఛ్..
లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియాతో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్లో కూడా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications