సమైక్యాంధ్ర కోసం న్యూఢిల్లీలో జగన్ పార్టీ ప్రయత్నాలు

YSRCP bats for Samaikyandhra
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాల్సిందిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమను కోరిందని సిపిఎం నేత నేత సీతారామ్ ఏచూరి మంగళవారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉండాలని సిపిఎం కోరుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెసు పార్టీ వైఖరే కారణమని ఆరోపించారు.

కాంగ్రెసు తీసుకున్న నిర్ణయాలను, అమలు చేస్తున్న విధానాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఉద్దేశ్యంలో భాగంగా తాము జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ సందర్భంగా చెప్పారు.

రెండో రోజు బాబు దీక్ష

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. కాంగ్రెసు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలతో కలిసి తెలుగు ప్రజలను మోసం చేస్తోందన్నారు.

తన దీక్షను అడ్డుకునేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల ప్రయోజాలను పక్కన పెట్టిందన్నారు. సోనియా గాంధీ ఆదేశాలతోనే తనను ఎపి భవన్ ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను రాజకీయాల కోసం దీక్ష చేయడం లేదన్నారు. తాము పోలీసులకు భయపడేది లేదని, చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని పయ్యావుల కేశవ్ అన్నారు.

రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు: షిండే

ఎపిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమే లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి పాలనపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని, అయితే అభిప్రాయం కోసమేనని బిల్లు పంపుతామని తెలిపారు.

విభజనపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. తెలంగాణపై కేబినెట్ నోట్ ఆమోదం తెలపడాన్ని లాయర్ కృష్ణయ్య హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని కోర్టు కొట్టి వేసింది. ఆర్టికల్ 3తో రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతింటుందని లాయర్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కేబినెట్ నోట్ పైన అసెంబ్లీలో చర్చ పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+