Exit poll: ట్రెండ్ సృష్టిస్తోన్న వైసీపీ
ఎగ్జాట్ పోల్ ఫలితాల కన్నా కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసమే ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు బట్టే .. ఎగ్జాట్ ఎన్నికల ఫలితాలుంటాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీలో ఫలితం కోసం రాజకీయ నేతలంతా కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోన్న పరిస్థితి కనిపిపిస్తోంది. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన , బీజేపీలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్‌పై పడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కడతాయో అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తుది దశ పోలింగ్ ముగియగానే అంటే శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఎగ్జిట్ ఫలితాలకు ముందు అధికార వైసీపీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అధికారిక ఎక్స్‌లో వైఎస్ఆర్‌సీపీ విన్నింగ్ బిగ్ అనే హ్యాట్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

జాతీయ స్థాయిలో వైసీపీ ట్రెండ్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వైసీపీ గెలుపు ఖాయమైందని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతున్నారు. గెలుపుపై ఎటువంటి అనుమానం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో వచ్చిన సీట్లకు కొన్ని తగ్గిన తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లండన్ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సీఎం జగన్ చర్చించారు.












Click it and Unblock the Notifications