గుడివాడలో కొడాలి నానికి షాక్ ఇచ్చింది ఎవరో కాదు..

గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అనే రీతిలో తన హవాను కొనసాగించారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు, లోకేష్ తోపాటు వారి కుటుంబ సభ్యులను కూడా అసభ్య పదజాలంతో దూషించడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇదే నా చివరి ఎన్నిక.. అందరూ ఓటేయండి అంటూ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిశాయి. వాటి భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైవుంది.

గుడివాడలో కొడాలి నాని గెలుస్తాడా? అంటే కచ్చితంగా వైసీపీవారే చెప్పలేకపోతున్నారు. ఆయన విజయానికి సంబంధించి నియోజకవర్గం మొత్తం చర్చ నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో కొడాలిని సొంత వైసీపీ పార్టీ శ్రేణులే వెన్నుపోటు పొడిచాయని మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఓ మైనార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఆయన ఓడిపోయేలా వైసీపీ కార్యకర్తలే పనిచేశారంటున్నారు. ఎన్నికలకు ముదు పంచాల్సిన డబ్బును ఎవరికి వారుగా మాయం చేసేశారు. ఈ విషయాన్ని ఆ మైనార్టీ నాయకుడు తెలిపారు. కొడాలి నాని దగ్గర నుంచి తీసుకున్న డబ్బుతో అమెరికా, మలేషియా వెళ్లి ఎంజాయ్ చేసిరావాలని నాయకులు భావిస్తున్నారంట.

ysrcp cadre who turned their back on kodali nani in gudivada

గుడివాడలో కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ నుంచి వెనిగండ్ల రాము పోటీచేశారు. ఏడాది కాలం నుంచి ఈయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. నానికి రాము గట్టి పోటీనిచ్చారని భావిస్తున్నారు. అయితే నానికి నియోజకవర్గంలో బలమైన పునాది ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తే నాని ఓటమిపాలవుతారని, ఏదేమైనప్పటికీ నియోజకవర్గంలో మాత్రం గట్టి పోటీ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నియోజకవర్గంలో ఫలితం ఎలా వస్తుందనేదానిపై ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ను కొడాలి నాని విమర్శించడమే అందుకు కారణం. ఎలాగైనా ఈసారి నానిని అక్కడ ఓడించాలనే ధ్యేయంతో కూటమి నేతలు పనిచేశారు. నాలుగోతేదీన వీరి భవిష్యత్తు తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+