బొబ్బిలి కోటలో మరో సమరానికి సై..!!
ఏపీలో మరో శాసనమండలి స్థానానికి ఎన్నికల నగరా మోగింది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికపై ఎలాంటి అడుగులు ముందుకు వేయడం లేదు. ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న వైసీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా కీలక ప్రణాళిక రచించింది. దీనికి సంబంధించిన రేపు తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కీలక భేటీ జరగనుంది.
ఇందుకూరి రఘరాజుపై వేటు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీ-పారంతో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘరాజు ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించారు. శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001-06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. ఈ ఫిరాయింపుపై వైఎస్సార్సీపీ, మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది. దీంతో మండలి చైర్మన్ మోషేన్ రాజు... వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో రఘురాజును ఆదేశించారు . ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉన్నప్పటికి... రఘురాజు హాజరు కాకపోవడంతో అతనిపై అనర్హత వేటు వేసింది మండలి. దీంతో జూన్ 3 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.

ఈ సందర్భంగా విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 4న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 28న ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వినియోగించుకోవచ్చు. డిసెంబర్ 1న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
వైసీపీ ఫోకస్..
ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడగానే వైసీపీ అలర్ట్ అయింది. సంఖ్యాబలం ప్రకారం ఈ స్థానం వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి 548, టీడీపీకి 168, ఇతరులు 16 మంది ఉన్నారు. మొత్తం 753 మందికి గాను 548 మంది సభ్యుల బలం వైసీపీకే ఉన్న తరుణంలో వైసీపీ ఈ శాసనమండలి స్థానాన్ని సులువుగా తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి నేతలు ఎంత క్యాంప్ రాజకీయాలు ప్రారంభించినా 380 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇప్పటికే ఈ జిల్లా నుంచి మండలిలో ప్రతిపక్షనేత బొత్సా సత్యనారాయణ ఫోకస్ పెట్టగా.. రీజనల్ కోఆర్డీనేటర్ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.ఇదిలా ఉంటే ఈ ఎన్నిక కోసం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు చంద్రబాబు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నిక నోటిఫికేషన్ నేపథ్యంలో వైసీపీ రేపు కీలక భేటీ నిర్వహించనుంది. పార్టీ సీనియర్లతోపాటు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన 548 మంది సభ్యులతో సమావేశం కానుంది. గెలుపుపై జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను సభ్యులకు వివరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ స్థానం నుంచి మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికకు సంబంధించి పూర్తి బాధ్యతలు బొత్స సత్యనారాయణకి అప్పగించినట్లు సమాచారం. అయితే వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications