వైసీపీలో జగన్ కీలక నియామకాలు - ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులు..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల పైన జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. కూటమి ప్రభుత్వం పైన కీలక అంశాల పైన పోరుబాట తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీలోనూ కీలక మార్పులకు జగన్ సిద్దం అయ్యారు. ఇప్పటికే ఉన్న ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులు చేసిన జగన్.. వచ్చే వారం కీలక సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. స్థానిక ఎన్నికల వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లే విధంగా వ్యూహలను అమలు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. డీఎస్సీ లో అక్రమాలు జరిగాయంటూ వరుసగా మీడియా సమావేశాలతో జగన్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇక.. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ధీటుగా నిలబడి ఎదుర్కోవాలని స్పష్టం చేసారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్ధి బరిలో లేకుంటే సంబంధిత నియోజకవర్గ ఇంఛార్జ్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని తేల్చి చెప్పారు. ఇక.. స్థానిక ఎన్నికల పై పార్టీ ముఖ్య నేతలకు జగన్ దిశా నిర్దేశం చేసారు. ఇదే సమయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల విషయంలోనూ జగన్ మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ బలోపేతం, సమన్వయం, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ప్రాంతాల వారీగా బాధ్యతలను అప్పగించారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ వారికి కేటాయించిన జిల్లాల్లో నిరంతరం అందు బాటులో ఉండాలని స్పష్టం చేసారు.

జగన్ దిశా నిర్దేశం
మాజీ సీఎం జగన్ తాజాగా చేసిన మార్పుల్లో భాగంగా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి నుంచి ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజధాని అమరావతి జిల్లా కావటం తో పాటుగా లోకేష్ - మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో.. అక్కడ స్థానిక సమరం వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. దీంతో.. సుబ్బారెడ్డి పూర్తిగా గుంటూరు జిల్లా పైనే ఫోకస్ చేసే విధంగా మిగిలిన జిల్లాల నుంచి తప్పించి గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయ కర్తగా బాధ్యతలు కేటాయించారు. ఇప్పటికే వీరికి జగన్ కీలక దిశా నిర్దేశం చేసారు. ఈ మూడు జిల్లా ల బాధ్యతలను ఈ ఇద్దరు పర్యవేక్షించనున్నారు. అదే విధంగా మిగిలిన జిల్లాల్లో బాధ్యతలు ఖరారు పైన వినాయక చవితి తరువాత జగన్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications
