వారికి మళ్లీ అవకాశం, స్థానిక అభ్యర్ధుల ఖరారు పై జగన్ బిగ్ డెసిషన్..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ రోజు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ ఎన్నికల పైన గత కొంత కాలంగా పార్టీ ముఖ్య నేతలతో జగన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ చోట అభ్యర్ధి బరిలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. రిజర్వేషన్లు ఖరారు కావటంతో అభ్యర్ధుల ఎంపిక పైనా దిశా నిర్దేశం చేసారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవిశ్వాసంతో పదవులు కోల్పోయిన వారికి తిరిగి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

స్థానిక ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక.. పోల్ స్ట్రాటజీల పైన పార్టీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ముఖ్య నేతలతో ఒన్ టు ఒన్ సమావేశాలు జరిపారు. అభ్యర్ధుల ఎంపిక పైనా దిశా నిర్దేశం చేసారు. అవిశ్వాసం కారణంగా పదవులు కోల్పోయిన మేయర్, ఛైర్మన్ లకు తిరిగి అవకాశం ఇవ్వాలని సూచించారు. సీట్ల ఖరారులో తొలి నుంచి పార్టీ లో పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసారు. ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో రాష్ట్రం లోని కార్పోరేషన్, మున్సిపాల్టీల రిజర్వేషన్ల వారీగా అభ్యర్ధుల జాబితాకు తుది రూపు ఇచ్చారు. కూటమి అభ్యర్ధుల పైన స్పష్టత వచ్చిన తరువాత సామాజిక సమీకరణాలు.. ప్రత్యర్థి అభ్యర్ధి బలం అంచనా కు అనుగుణంగా పార్టీ నుంచి పోటీ చేసే వారిని ఖరారు చేయాలని నిర్దేశించారు. ఎన్నిక లు పూర్తి అయ్యే వరకూ ప్రాంతీయ సమన్వయకర్తలు ప్రతీ క్షణం అందుబాటులో ఉండాలని జగన్ స్పష్టం చేసారు.

 జనసేన స్థానాలు ఇవే, బీజేపీకి ఫిక్స్ - కూటమిలో సీట్ల సర్దుబాటు ఇలా..!!
జనసేన స్థానాలు ఇవే, బీజేపీకి ఫిక్స్ - కూటమిలో సీట్ల సర్దుబాటు ఇలా..!!
ysrcp-chief-ys-jagan-directs-party-leaders-on-candidate-selection-for-local-body-polls-here-the-det

అభ్యర్దుల జాబితా సిద్దం... కీలక ఆదేశాలు

అభ్యర్ధుల ప్రకటన నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు వారికి కావాల్సిన విధంగా సహకారం అందించాలని జగన్ ఆదేశించారు. అదే విధంగా పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలను ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు. విశాఖపట్నంలో వైసీపీ నేత శశికళకు ఎస్సీ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా అగ్రవర్ణానికి చెందిన కాపు కులస్తురాలిగా పేర్కొంటూ సర్టిఫికెట్‌ ఇచ్చారని జగన్‌ విమర్శించారు. దీనిపై గట్టిగా నిలదీయాలని ఆమెకు సూచించారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో బలమైన అభ్యర్ధులను ఎంపిక చేస్తామన్నారు. ఈ రోజు (బుధవారం) మునిసిపల్‌ కార్పొరేషన్లు.. మున్సిపాల్టీల్లో పోటీ చేసే కార్పోరేటర్లు.. కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. కాగా.. అయితే, రాష్ట్రస్థాయిలో క్యాస్ట్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై రాజీ పడవద్దని, గట్టిగా పోరాడాలని నేతలకు ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+