వైజాగ్ స్టీల్ ఉద్యోగులదే తప్పా? చంద్రబాబు కామెంట్స్ పై వైసీపీ ఫైర్..!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు తాజాగా సీఐఐ సదస్సు సందర్బంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా పనితీరు మెరుగుపర్చుకోకుండా ప్రైవేటీకరణ ఆపడం లేదంటూ ఉద్యోగులు ఒత్తిడి పెంచడాన్ని తప్పుబడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టింది.

గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేక పోతోందని దుమ్మెత్తి పోసిన చంద్రబాబు... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యూటర్న్‌ తీసుకున్నారని వైసీపీ మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ, ఒకవైపు ప్రజలను మభ్య పెడుతూ, మరోవైపు ఆ దిశలో కేంద్ర చర్యలను పూర్తిగా సమర్థిస్తున్నారన్నారు. అందుకు చంద్రబాబు తాజా వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

ysrcp condemns Chandrababu s remarks on vizag steel employees says another betrayal

'పని చేయకున్నా జీతాలివ్వాలా? తెల్ల ఏనుగులా మారితే ఎలా? ఎన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి? ఊర్కే జీతాలు ఎందుకిస్తాయి?' అనడం.. సీఎం చంద్రబాబు దిగజారిన వైఖరికి అద్దం పడుతున్నాయని వారు విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసినట్లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను కూడా దారుణంగా వంచించారని, నిలువుగా దగా చేశారని వారు ఆరోపించారు.

అదే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొన్నాళ్ల క్రితం కేంద్రం ప్యాకేజీ ఇస్తే, అది తమ ఘనత అన్నట్లు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని, స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని, తమ చొరవ వల్లే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని డబ్బా కొట్టుకున్నారని, నిజానికి కేంద్రం ఆ నిధులు ఇచ్చింది స్టీల్‌ ప్లాంట్‌ను గట్టెక్కించడానికా? లేక ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకా? అన్నది చూస్తే.. రెండోదే ఖాయంగా తేలుతోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడడంలో సీఎం చంద్రబాబు ఇసుమంతైనా చొరవ చూపడం లేదన్నారు. పైగా తన సిద్ధాంతమైన ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారని, అయినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్లీ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ysrcp condemns Chandrababu s remarks on vizag steel employees says another betrayal

తమ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా చంద్రబాబు కానీ, పవన్‌కళ్యాణ్‌ కానీ నోరు మెదపడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. పరోక్షంగా లక్షలాదిపై ప్రభావం చూపుతున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో తీపి తీపి మాటలతో నమ్మించిన కూటమి నేతలు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో రాష్ట్రప్రజలను నిండా ముంచేశారన్నారు. కేంద్రంతో కలసి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కళ్ల ఎదుటే ఉరి తీస్తున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+