వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆ అధికారులు జైలుకే: విజయసాయి రెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఖరారు చేసినట్టు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టిడిపి ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఏపీ రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే వైసీపీ తమ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా వైసీపీ ఒక రాజ్యసభ అభ్యర్థిని గెలుచుకొనే అవకాశం ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపి నేతలు ప్రలోభపెడుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

అధికార పార్టీకి అధికారులు కూడ వత్తాసు పలుకుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొందరు అధికారులు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నిర్ణయించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖపట్టణంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు శనివారం నాడు పరిచయం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయానికి అవసరమైన 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విజయసాయిరెడ్డి ప్రకటించారు.అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టిడిపి నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు.

''తమిళనాడు తరహలో బిజెపికి బుద్ది చెప్పాలి,పవన్‌ కళ్యాణ్ సీఎం''''తమిళనాడు తరహలో బిజెపికి బుద్ది చెప్పాలి,పవన్‌ కళ్యాణ్ సీఎం''

టిడిపి వ్యూహమిదే

టిడిపి వ్యూహమిదే

ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు 28 మంది వైసీపీ నుండి టిడిపిలో చేరారు అయితే ప్రస్తుతం వైసీపీకి ఏపీ అసెంబ్లీలో 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజానికి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు కూడ సాంకేతికంగా వైసీపీ సభ్యులే. రాజ్యసభ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించకుండా ఉండాలంటే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించాలి. 40 కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉంటే రాజ్యసభ ఎన్నికల్లో ఆ అభ్యర్థి విజయావకాలు సన్నగిల్లినట్టే. దీంతో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై టిడిపి వల వేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు.

రాజీనామా అస్త్రం: ఉప ఎన్నికలకు జగన్ ప్లాన్, అదే జరిగితే బాబుకు దెబ్బే?రాజీనామా అస్త్రం: ఉప ఎన్నికలకు జగన్ ప్లాన్, అదే జరిగితే బాబుకు దెబ్బే?

ప్రలోభాలకు గురి చేస్తున్న అధికారులు

ప్రలోభాలకు గురి చేస్తున్న అధికారులు

వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు అధికారులు కూడ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.ఇప్పటివరకు సీఎంతో సహా మంత్రులు, ముఖ్యనేతలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, తాజాగా ఉన్నతాధికారులు కూడా అలాగే పని చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, అదనపు డీజీ వెంకటేశ్వర్లు టీడీపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

జైలుకే అధికారులను పంపుతాం

జైలుకే అధికారులను పంపుతాం

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న అధికారుల చిట్టా తమ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. అయితే తాము అధికారుంలోకి రాగానే అడ్డదారులు తొక్కిన అధికారులను జైలుకు పంపుతామని విజయసాయి రెడ్డి హెచ్చరించారు.

English summary
vYsrcp Mp Vijayasai Reddy said that Ys Jagan decided Vemireddy Prabhakar Reddy as candidate for Rajyasabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X