చంద్రబాబుకు మాత్రం ఇవ్వం-వాళ్లకే ఇస్తాం-తేల్చేసిన వైసీపీ ..!

ఏపీలో వైసీపీకీ, కూటమిలో పార్టీలకు మధ్య కొంతకాలంగా సాగుతున్న రాజకీయ పోరు ప్రభావం విజయవాడ వరద బాధితులపైనా పడుతోంది. విజయవాడలో భారీ వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో చాలా మంది స్పందిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది.

విజయవాడ వరద బాధితుల కోసం వైసీపీ తరఫున కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు గతంలో మాజీ సీఎం జగన్ ప్రకటించారు. అంత కాదు ఈ మొత్తం ఎలా అందించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. ఇప్పుడు దానిపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. విజయవాడ వరద బాధితుల కోసం తాము అందించే సాయాన్ని నేరుగానే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ysrcp denied donation to vijayawada flood victims via cmrf decided to give directly

వైయస్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం ఇచ్చారని, మళ్ళీ నిన్న కూడా ఒక పది లక్షలు ఇచ్చారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది బాధితులకు మేమే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తున్నామని ఆయన స్పష్టత ఇచ్చేశారు. దీంతో విజయవాడ వరద బాథితుల కోసం అందించే విరాళాల్ని ప్రభుత్వానికి ఇవ్వబోవడం లేదని వైసీపీ తేల్చిచెప్పినట్లయింద.

-బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్ష నేత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+