దేవినేనిని అడ్డుకున్న పోలీసులు: భారీగా హౌస్ అరెస్టులు
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ భారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది.
తొలి విడతలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలను నేడు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఆ పార్టీ నాయకులు. 20,000 రూపాయల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా విధానాన్ని పునరుద్ధరించాలంటూ నినాదాలు చేస్తోన్నారు. అన్నిజిల్లాల కలెక్టర్ల కార్యాలయాలకు ర్యాలీగా తరలి వెళ్తోన్నారు.

దీనికి కొనసాగింపుగా.. పెంచిన కరెంటు ఛార్జీలపై ఈ నెల 27వ తేదీన ఎస్‌ఈ కార్యాలయాలు, డిస్కమ్‌ల సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించనున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. విద్యుత్ ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేయనున్నారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై జనవరి 3వ తేదీన పోరుబాట పట్టనున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రాలను అందిస్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ నినదిస్తారు.
విజయవాడలో వైసీపీ రైతు సమస్యలపై చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పార్టీ నాయకులపై పోలీసులు ఎక్కడికక్కడఆంక్షలను విధిస్తున్నారు. రైతులకు అండగా నిరసన తెలపకుండా అరెస్ట్‌లు చేస్తోన్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరిన వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు వెళ్లకుండా దారిలోనే ఆయనను అడ్డుకున్నారు. అవినాష్‌ను సిటీలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని వైసీపీ విజయవాడ నాయకులు మండిపడుతున్నారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి చుట్టూ పోలీసుల మోహరించారు. మల్లాది విష్ణు, కార్పొరేటర్లు బయటకు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు విధించారు. వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. జిల్లాలోని నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్నాథరావునూ హౌస్ అరెస్ట్ చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications