అరెస్టుల వేళ.. వైఎస్ జగన్ బిగ్ స్టెప్..!!

YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటోన్న వరుస అరెస్టుల వ్యవహారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేరింది.

పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ అంశాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు హక్కుల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మాన‌వ‌ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ యథేచ్ఛగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్ఆర్‌సీ తాత్కాలిక చైర్‌పర్సన్ విజయ భారతికి లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

YSRCP files a complaint at NHRC against the arrest of its Party supporters in Andhra Pradesh

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు, లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ తనూజా రాణి.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియా అరెస్టులపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించినట్లు చెప్పారు.

ఏపీలో తమ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలను టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఉద్దేశపూరకంగా కేసులను బనాయిస్తోందని వైవీ సుబ్బారెడ్డి, తనూజా రాణి, బాబురావు ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

ఈ క్రమంలోనే తమ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ.. చిత్రహింసలకు గురి చేస్తోందంటూ వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఆయా విషయాలన్నింటినీ కూడా మానవ హక్కుల కమిషన్‌ యాక్టింగ్ ఛైర్‌పర్స్‌కు వివరించామని, లిఖితపూరకంగా ఫిర్యాదు చేశామని చెప్పారు.

రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదని అన్నారు.

ఈ అరెస్టుల వ్యవహారంపై తక్షణమే జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని, సమగ్ర విచారణను జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మానవ హక్కులను పరిరక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+