చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు నీడలా..!!

Chandrababu Naidu and Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. రోడ్ షోలు, బహిరంగ సభలతో రాష్ట్రం మొత్తం హోరెత్తిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి.

ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటోన్నాయి. విమర్శల దాడులు తీవ్రతరం అయ్యాయి. వ్యక్తగత విమర్శలూ యథేచ్ఛగా దొర్లుతున్నాయి.

YSRCP files complaint at ECI against Chandrababu Naidu and Pawan Kalyan

ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు వారిని ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన టీడీపీ ఉమ్మడి కూటమి బహిరంగ సభలో వారిద్దరితో పాటు నరసాపురం బీజేపీ లోక్‌సభ అభ్యర్ది శ్రీనివాసవర్మ.. వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్య‌లు కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి.

వైఎస్ఆర్సీపీ నాయకులు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తివిరుధ్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే- తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బ‌హిరంగ స‌భ‌లో కూడా వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుధ్దంగా ఉన్నాయని అన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను అందజేశారు.

ఓ దినపత్రికలో ఓ జనహంతక చక్రవర్తి అనే శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కథనం- ప్రతిపక్ష పార్టీలకు మేలు చేసేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ దినపత్రిక టీడీపీకి కరపత్రంలా మారిందని, అవాస్తవ సమాచారంతో వార్తను వండి వార్చారని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+